ఖర్చు తగ్గింది-పొదుపు వైపు చూపు

ఖర్చు తగ్గింది-పొదుపు వైపు చూపు

న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు ఖర్చులు కూడా తగ్గిపోతున్న‌య్. అనవసరమైన ఖర్చులను ప్రజలు తిరస్కరిస్తున్నారు. అంటే షాపింగ్‌‌ల కోసం మాల్స్ కు వెళ్ల‌డం, రెస్టారెంట్లకు వెళ్లి డిన్నర్ చేయడం,సెలూన్లలో స్టయిలిష్ హెయిర్ కటింగ్స్ చేసు కోవడం వంటి వాటిన్నంటిన్ని ప్రజలు తగ్గిస్తున్నారని మార్కెట్ రీసెర్చ్ సంస్థ నీల్సన్ సర్వే చెప్పింది. కేవలం ఆరోగ్యకరమైన, శుభ్రమైన ప్రొడక్ట్స్ వంటి అత్యవసర వాటికే ఖర్చు చేస్తున్నారని వెల్లడించింది. నీల్సన్ చేపట్టిన సర్వేలో 64 శాతం
మంది కన్జూమర్లు రెస్టారెంట్లకు , మూవీలకు ఖర్చు పెట్టడం తగ్గిస్తున్నామ‌ని చెప్పారు. ప్యాకేజ్డ్ రైస్, గోధుమలు, సోపులు వంటి అవసరమైన వస్తువులకే ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నట్టు నీల్సన్ చెప్పింది. ఫాస్ట్మూవింగ్ కన్జూమర్ గూడ్స్ అండ్ రిటైల్‌‌పై కరోనా ప్రభావం ఎలా ఉంటుందనే విషయంపై నీల్సన్ తన రిపోర్ట్ రెండో ఎడిషన్‌‌ను విడుదల చేసింది. ఈ సర్వేను 23 నగరాల్లో 1,330 మందిపై ఈ నెల 10 నుంచి 14 వరకు చేపట్టింది. ఆన్‌‌లైన్ ద్వారా ఈ సర్వేను నిర్వహించింది.

ఇంట్లోనే వండుకుని తింటాం…

బయటికి వెళ్లి రెస్టారెంట్లలో తినడం కంటే..ఇంట్లోనే వండుకుని తింటామని సర్వేలో పాల్గొన్న రెస్పాడెంట్లు చెప్పారు. ప్రజలు ఎక్కువగా ఇంట్లోనే వండుకోవడానికి ఇష్టపడుతున్నారని, ఇంట్లోనే ఉంటూ.. హెల్తీ ఫుడ్‌‌ను తీసుకుంటున్నారని మారికో ఇండియా చీఫ్ ఆపరేటింగ్ఆఫీసర్ సంజయ్ మిశ్రా పేర్కొన్నా రు. ఈమహమ్మారి వదిలిన తర్వాత కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందని వివరించారు. మళ్లీ కన్జూమర్ నమ్మకాన్ని పొందాలంటే బ్రాండ్స్ చాలా హార్డ్వర్క్ చేయాలని పిజ్జా హట్ మార్కెటింగ్ డైరెక్టర్ నేహ తెలిపారు. వారి అవసరాలను నెరవేరుస్తూ ఉండాలన్నారు. అయితే పిజ్జా హట్ డెలివరీస్పె రుగుతాయని ఆమె ఆశిస్తున్నారు. ఈ పెరిగిన డిమాండ్ మేరకు టెక్నాలజీ అప్‌ గ్రేడెషన్స్ చేపట్టి.. కాంటాక్ట్‌‌లెస్ ప్రాసెస్ ద్వారా హోమ్ డెలివరీ చేస్తామని హామీ ఇచ్చారు.

రద్దీ ప్రాంతాలకు వెళ్లరు…

పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక.. లాక్‌‌డౌన్ఎత్తివేశాక కూడా ప్రజలు రద్దీ ప్రాంతాల్లో అంత కంఫర్ట‌బుల్ గా ఫీల్ కారని నీల్సన్​కు చెందిన సమీర్ శుక్లా తెలిపారు. ఎయిర్‌లైన్స్, రెస్టారెంట్స్, క్ల‌బ్స్ , మెట్రోలు వంటి వాటిపై అంత ఆసక్తి చూపరని వివరించారు.