లాక్ డౌన్ సడలిస్తే భారత్ లో తీవ్ర పరిణామాలు

లాక్ డౌన్ సడలిస్తే భారత్ లో తీవ్ర పరిణామాలు
  • డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

జెనీవా : ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు లాక్ డౌన్ నుంచి సడలింపులు ఇవ్వటంపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా కాస్త తగ్గుముఖం పట్టే సమయంలో మరింత కఠినంగా వ్యవహారించాలని కోరింది. కరోనా వైరస్ పూర్తిగా తగ్గే వరకు లాక్ డౌన్ నిబంధనల్లో సడలింపులు వద్దని డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ విభాగం అధికారి డాక్టర్ మైక్ ర్యాన్ కోరారు. ఫిజికల్ డిస్టెన్స్, లాక్ డౌన్ వంటి చర్యలు మాత్రమే కరోనాను కంట్రోల్ చేస్తాయని ఆయన స్పష్టం చేశారు. అమెరికా, ఇండియా లాంటి దేశాల్లో సడలింపులు ఇస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. తాజాగా మనదేశం రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల పేరుతో ఆరెంజ్, గ్రీన్ జోన్లలో పలు మినహాయింపులు ఇచ్చింది. ఈ తరుణంలో డబ్య్లూహెచ్ఓ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. లాక్ డౌన్ నుంచి సడలింపులు ఇచ్చే దేశాలు మరోసారి ఆలోచించాలని మైక్ ర్యాన్ కోరారు. సడలింపులు ఇచ్చిన దేశాల్లో కేసులు ఒక్కసారిగా పెరిగాయని ఆయన గుర్తు చేశారు. కరోనా ప్రభావం లేదంటూ కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు ఎత్తివేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని మైక్ ర్యాన్ స్పష్టం చేశారు