లాక్ డౌన్ పొడిగింపు.. సడలింపులివే..

లాక్ డౌన్ పొడిగింపు.. సడలింపులివే..

హైద‌రాబాద్: లాక్ డౌన్ పొడిగింపు క్ర‌మంలో కొన్ని సడలింపులు చేసింది ప్ర‌భుత్వం. నిబంధనలను అనుసరించి.. ప్రభుత్వ పనిదినాల్లో, స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేషన్ల శాఖ ఆధ్వర్యంలో జరిగే భూములు, ఆస్తుల రిజిష్ట్రేషన్లతో పాటు, రవాణాశాఖ ఆధ్వర్యంలో జరిగే వాహనాల రిజిస్ట్రేషన్ కార్యకలాపాలకు అనుమతించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్ డౌన్ ను రేపటి నుంచి ( మే 31 ) మరో పదిరోజుల పాటు కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది.

ఇందులో భాగంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఉంటుంది. సడలింపు సమయం తర్వాత బయటకు వెల్లిన వాల్లు ఇంటికి చేరడానికి మరో గంట పాటు, అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు సమయం ఇస్తారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి తెల్లారి ఉదయం ఆరు గంటల దాకా కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేయాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం నాడు సమావేశమైన రాష్ట్ర  కేబినెట్ నిర్ణయించింది.