తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేత

తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేత

లాక్ డౌన్ ను సంపూర్ణంగా ఎత్తివేయాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని.. కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని,  వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను కేబినెట్ పరిశీలించింది. దీనికి సంబంధించి  పూర్తిగా లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. 

లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది.