వెల్ లోకి దూసుకెళ్లిన విపక్షాలు.. పార్లమెంట్ వాయిదా

వెల్ లోకి దూసుకెళ్లిన విపక్షాలు.. పార్లమెంట్ వాయిదా

విపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్షాలు సభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. మరోవైపు ఇదే అంశంపై చర్చకు పట్టుబడుతున్న బీఆర్ఎస్, ఇతర పార్టీలు వాయిదా తీర్మానం ఇచ్చాయి. అదానీ కంపెనీల్లో జరుగుతున్న అవకతవకలపై చర్చ జరగాల్సిందేనంటూ లోక్ సభలో విపక్ష సభ్యులు స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్లారు. ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. ప్రతిపక్ష సభ్యులకు స్పీకర్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అటు రాజ్యసభలోనూ సేమ్ సీన్ రిపీట్ కావడంతో ఛైర్మన్ ధన్ కర్ సభను మధ్యాహ్నం రెండింటి వరకు వాయిదా వేశారు. 

ఎల్ఐసీ, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్ స్టిట్యూషన్లకు చెందిన నిధులను కేంద్రం మార్కెట్ వాల్యూ కోల్పోతున్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి ప్రజా ధనాన్ని వృధా చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ అంశంపై చర్చకు డిమాండ్ చేస్తూ పార్టీ సభాపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే రూల్ 267 కింద బిజినెస్ సస్పెన్షన్ నోటీసు ఇచ్చారు. అయితే దాన్ని స్పీకర్ తిరస్కరించడంపై కాంగ్రెస్ మండిపడుతోంది. ప్రతిపక్షాలు కీలకమైన అంశాలపై చర్చకు పట్టుబట్టినా స్పీకర్ పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు.