రజినీకాంత్ కూలీ సినిమా జులై నుంచి సెట్స్‌‌‌‌కు..

రజినీకాంత్ కూలీ సినిమా జులై నుంచి సెట్స్‌‌‌‌కు..

రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న  సంగతి తెలిసిందే.  రజినీ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ‘కూలీ’ టైటిల్‌‌‌‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. ఇందులో రజినీకాంత్ లుక్ ఏ విధంగా ఉంటుందో సోషల్ మీడియా ద్వారా పరిచయం చేశాడు లోకేష్. తాజాగా లుక్ టెస్ట్ ఫొటోను షేర్ చేసిన లోకేష్.. జులై నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌‌‌‌ను స్టార్ట్ చేస్తున్నట్టు తెలియజేశాడు.  

గోల్డ్ మాఫియా బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో ఈ సినిమాను తీస్తున్నట్టు ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఫస్ట్ లుక్ ద్వారా రివీల్ చేశాడు.  అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే దర్శకుడు జ్ఞానవేల్ రూపొందిస్తున్న ‘వేట్టయాన్’ చిత్రాన్ని పూర్తి చేశారు రజినీకాంత్. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.