హిట్ అండ్ రన్ కేసులు ఏంటీ.. ట్రక్, ట్యాక్సీ, బస్సు డ్రైవర్ల సమ్మె ఎందుకు..?

హిట్ అండ్ రన్ కేసులు ఏంటీ.. ట్రక్, ట్యాక్సీ, బస్సు డ్రైవర్ల సమ్మె ఎందుకు..?

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించిన రూల్ కు వ్యతిరేకంగా ప్రైవేట్ బస్సు, ట్రక్కు డ్రైవర్లు దేశ వ్యాప్తంగా ఆందోళనకు దిగారు.  హిట్ అండ్ రన్  కేసుల్లో భారతీయ న్యాయ సంహిత 2023 చట్టం కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా డ్రైవర్ల నిరసనతో ట్రక్కులు నిలిచిపోయాయి.  దీంతో పెట్రలో,డీజిల్ కొరత ఏర్పడుతుందన్న భయంతో  వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు.  దేశంలోని చాలా చోట్ల పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు బారులు తీరారు. 

హిమాచల్ ప్రదేశంలో ని ధర్మశాల,పెట్రోల్ పంపుల దగ్గర   వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూ కట్టారు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఇదే పరిస్థితి ఉంది. డ్రైవర్ల నిరసనల వల్ల పెట్రోల్ పంపుల దగ్గర భారీగా క్యూలైన్లలో ఉన్నారు.   డ్రైవర్ల ఆందోళనతో  1.20 లక్షల ట్రక్కులు, టెంపోలు కంటైనర్లలో 70 శాతానికి పైగా రోడ్లపైన నిలిచిపోయాయి.  రానున్న రోజుల్లో ఇది కూరగాయల సరఫరాపై కూడా ప్రభావం చూపుతుందని అంటున్నారు. 

హిట్ అండ్ రన్ కేసు అంటే ఏంటి..సమ్మె ఎందుకు

కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం ప్రకారం న్యాయ సంహిత హిట్ అండ్ రన్ కేసులో ఏదైనా ప్రమాదం జరిగితే డ్రైవర్లు సమాచారం ఇవ్వకుండ పారిపోవద్దు. ఒకవేళ పారిపోతే డ్రైవర్లకు రూ. 7లక్షల జరిమానాతో పాటు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది.  దీనిపై ట్రక్కులు, లారీలు, ప్రైవేటు బస్సుల డ్రైవర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధన వల్ల చాలా ఇబ్బందులు వస్తాయని ఆల్ ఇండియా డ్రైవర్ల అసోసియేషన్ కూడా వ్యతిరేకిస్తుంది.