
Krishnastami 2025: శ్రావణమాసం కొనసాగుతుంది. సగం పైన అయిపోయింది... శ్రావణమాసం కృష్ణపక్షంలో అత్యంత ప్రాముఖ్యత రోజు ఉందని పురాణా ద్వారా చెబుతున్నాయి. ఎనిమిదో నెల.. ఎనిమిదో రోజు సాక్షాత్తు విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారంగా.. శ్రీకృష్ణ భగవానుడికి జన్మించిన రోజు. ఈ ఏడాది అలాంటి పవిత్రమైన రోజు ఆగస్టు 16 న జరుపుకుంటున్నాం. శ్రీకృష్ణాజన్మాష్టమి గురించి .. ఆయన పుట్టుక ఆవస్యకత.. ఎలా పుట్టాడు.. విష్ణుమూర్తే కృష్ణావతారంగా భూమ్మీదకు ఎందుకు రావలసి వచ్చిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .
ఎనిమిదో నెల (శ్రావణ మాసం) ఎనిమిదో (అష్టమి) రోజు విష్ణుమూర్తే స్వయంగా కన్నయ్యగా పుట్టాడు. గోకులంలో గోపాలుడిగా అల్లరి చేసి మురిపించాడు. వెన్నతో పాటు. గోపికల మనసునూ దొంగిలించాడు.
రాధా కృష్ణుడిగా అసలు సిసలు ప్రేమ ఎలా ఉంటుందో నిరూపించాడు.
మనిషి ధర్మంగా ఎలా జీవించాలో... గీతలో జ్ఞానోదయం కలిగించాడు. ఇన్ని లీలలు ఒక్కడిలో ఉన్నాయి. కాబట్టే..ఒక అష్టమి ఆయన పేరు పెట్టుకుంది. అందుకే నల్లనయ్యను 'యూనివర్సల్ ఫ్రెండ్' అని కూడా అంటారు. అందుకే, ఈ బేబీ కృష్ణుడికి యుగయుగాలుగా పుట్టిన రోజు పండుగ జరుపుతున్నారు. ఈ ఏడాది ఆగస్టు 16న జరుపుకుంటున్నాము.
Also read:-చిన్ని కృష్ణుడు జన్మ వృత్తాంతం ఇదే.. శ్రీ విష్ణువు ఎన్నో అవతారమో తెలుసా..!
ఇంట్లో తమ పిల్లల్ని ముస్తాబు చేసి.. వాళ్లలో బాలకృష్ణుడిని చూసుకుంటున్నారు. ముగ్గులు వేసి.. వెన్న తినిపించి ఆ అల్లరికి స్వాగతం చెప్తారు.కృష్ణుడు కారణజన్ముడు. పాపాలతో పండిపో యిన కంసుడ్ని చంపడానికి శ్రీమహావి ష్ణువే కృష్ణుడిగా జన్మించాడు. పూర్వం మధుర సామ్రాజ్యానికి ఉగ్రసేన అనే రాజు ఉండేవాడు. అతని కొడుకే కంసుడు ఆయనే మధురకు యువరాజు కంసుడు కరుణ, జాలి లేని కఠినాత్ము డు. అతని క్రూరత్వం చూసి మధురలో అంతా భయపడేవారు.
ఈ భూమ్మీద కంసుడు ప్రేమించే ఏకైక వ్యక్తి ఒకరున్నారు. ఆమె అతని చెల్లెలు దేవకి! ఆమె కంసుడిలా కాదు. భక్తి.. ప్రేమ లెక్కువ. కొన్నాళ్లకు వసుదేవుడికి, దేవకికి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. స్వయంగా కంసుడే ఆ కొత్త జంటను అత్తగారింటికి తీసుకొని గుర్రపు బండిలో బయలు దేరుతాడు.
అయితే దారి మధ్యలో అకస్మాత్తుగా గాలిదుమారం లేస్తుంది. వెంటనే ఓ కంసా.. ఎందుకంత సంతోషంగా ఉన్నావు? నీ ప్రియమైన చెల్లెలు ఒక కొడుకుకి జన్మబోతోంది. ఆమె ఎనిమిదో కుమారుడే నిన్నునాశనం చేస్తాడు. జాగ్రత్త! అని ఆకాశవాణి వినిపిస్తుంది. అది వినగానే కంసుడి కోపం కట్టలు తెంచుకుంటుంది.
'నిన్నిప్పుడే చంపేస్తా ఇక నీ ఎనిమిదో కొడుకు ఎలా పుడతాడో చూస్తా" అని దేవకి మెడపై కత్తి పెడతాను. 'కంసా... నువ్వు ఏం. చేస్తున్నావో తెలుసా? పెళ్లి రోజే నీ చెల్లిని చంపడం న్యాయం కాదు. మాకు పుట్టిన ప్రతీ బిడ్డను నీకే అప్పగిస్తాను. నీకు మాటిస్తున్నా. నన్ను నమ్మి దేవకిని క్షమించు' అనడుగుతాడు వసుదేవుడు. దానికి సరేనంటాడు కంసుడు తర్వాత వసుదేవు డిని... . దేవకిని మధురకు తీసుకొచ్చి జైల్లో బంధిస్తా డు.
దేవకి కొడుకుకి జన్మనిచ్చిందని తెలియగానే... వెంటనే వెళ్లి దేవకి దగ్గర పిల్లాడిని నేలకు కొట్టి చంపేస్తాడు కంసుడు. అలాగే, విరుసుగా మరో ఐదుగుర్ని పుట్టగానే చంపేస్తాడు. ఏడో సారి గర్భం దాల్చినప్పుడు మాత్రం ఒక మెరుపు లాంటి అద్భుత శక్తి వచ్చి ఆ గర్భంలో ఉన్న శిశువుని తీసుకెళ్లి గోకులంలో ఉన్న వసుదేవుడి మరో భార్య రోహిణి గర్భంలో పడేస్తుంది. తర్వాత అతనే బలరాముడిగా పుడతాడు. అందుకే దేవకి ఏడో కొడుకు ప్రాణం లేకుండా పుడతాడు..
ఎనిమిదో పుత్రుడు
ఎనిమిదో నెల శ్రావణ మాసంలో ఎనిమిదో రోజు. ఆరోజు భయంకరమైన ఉరుములు మెరుపులతో మధురలో వర్షం కురుస్తుంది. అకస్మాత్తుగా ఆ జైలు గదిలో విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు 'మీ కోరిక నెరవేరుతుంది. నేను మీకుమారుడిగా పుడుతున్నాను. వాసుదేవా! ఈ పిల్లాడ్ని తీసుకొని గోకులంలో నందగోపాలుడి ఇంట్లో వదులు' అని మాయమవుతాడు. ఆరోజు అర్థరాత్రి దేవకి
నల్లనయ్య కృష్ణుడికి జన్మనిస్తుంది. పిల్లాడు పుట్టగానే కాపలా కాస్తున్న భటులంతా మూర్చపోతారు.
అప్పుడు వసుదేవుడు ఆ పిల్లాడ్ని గంపలో పెట్టు కుని యమున నదీ తీరానికి చేరుకుంటాడు. నది అతనికి దారినిస్తుంది. వసుదేవుడు నంద గోపాలుడి ఇంటికి వెళ్లేసరికి యశోద ఒక ఆడ పిల్లకు జన్మనిచ్చే ఉంటుంది. ఆమెకు మెలకు రాకముందే.. ఆడపిల్ల ప్లేస్ లో కన్నయ్యను వదిలి.. ఆ చిన్నారిని తీసుకుని తిరిగి జైలుకు వస్తాడు. భటులు మూర్చ నుంచి చేరుకుంటారు. పసిపిల్ల ఏడుపులు విని వెళ్లి కంసుడికి చెప్తారు. అతను వెళ్లి పసిపాపను చంపబోతుండగా.. 'ఒక ఆడపిల్ల నీలాంటి వీరుడిని ఎలా చం పగలదు?" అని అంటారు వసుదేవుడు. అయిన వాళ్ల మాట వినకుండా చంపుతుండగా, ఆమె చేతిలోంచి మెరుపులా జారి దుర్గామాతగా ప్రత్యక్షమవు తుంది.
'పసిపిల్లను చంపుతావా? అర్థరాత్రే దేవకికి కొడుకు పుట్టాడు. గోకులంలో సురక్షితంగా ఉన్నాడు. సమయం వచ్చినప్పుడు నిన్ను వెతు క్కుంటూ వచ్చి నీ పాపాలన్నింటికి శిక్ష వేస్తాడు' అని దుర్గామాత మాయమవుతుంది. అప్పటి నుంచి కంసుడి గుండెలో భయం మొదలవుతుంది.
తర్వాత గోకులంలోని యశోద కుమారుడిగా కృష్ణుడి అల్లరిని... పురాణాల్లో చదివినా విన్నామనసు పులకించిపోతుంది. అంత సంతోషక రమైన బాల్యం దేవునికే సాధ్యం కదా! వెన్నదో చుకుంటాడు. గోపికల మనసు దోచుకుంటాడు. కంసుడు పంపే రాక్షసులతో అడుకుంటాడు. చివరకు కంసుడిని చంపేస్తాడు..!