ఏప్రిల్ 9 నుంచి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

ఏప్రిల్ 9 నుంచి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగరంలోని 4వ డివిజన్ యూపీహెచ్ కాలనీ వెంకటేశ్వర స్వామి వెలసి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 9 నుంచి 13వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. బుధవారం ఆలయకమిటీ సభ్యులు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు.  

చివరి రోజు మధ్యాహ్నం 15 వేల మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు బొల్లి కొమురయ్య, కార్యదర్శి పురం తిరపయ్య, కోశాధికారి బానోతు మల్సూర్ నాయక్, గౌరవ సలహాదారులు దండా జ్యోతి రెడ్డి, అల్లిక అంజయ్య యాదవ్, అర్చకులు రామాచార్యులు పాల్గొన్నారు.