
ఎల్బీ నగర్ లో యాక్సిడెంట్ జరిగింది. రోడ్డు శుభ్రం చేస్తున్న అంజమ్మ అనే పారిశుద్ధ్య కార్మికురాలిపైకి లారీ దూసుకెళ్లింది. దీంతో అంజమ్మ తీవ్రంగా గాయపడ్డారు. ఆమె రెండు కాళ్లకు ఫ్రాక్చర్ అయింది. వెంటనే ఆమెను నాచారంలోని ESIకి తరలించారు. అక్కడ డాక్టర్లు పట్టించుకోకవడంతో పారిశుద్ధ్య కార్మికులు సిబ్బందితో గొడవకు దిగారు. తర్వాత సనత్ నగర్ ESI హాస్పిటల్ కు తరలించారు. అంజమ్మ ప్రస్తుతం స్పృహలో లేదు. మరోవైపు ఇంత జరిగినా ఏ ఒక్క అధికారి పట్టించుకోవడంలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు అంజమ్మను గుద్ది పరారవుతున్న లారీని కార్మికుల సూపర్ వైజర్ వెంబడించి పట్టకున్నారు.