యాదాద్రిలో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ల ఓవరాక్షన్

యాదాద్రిలో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ల ఓవరాక్షన్

యాదాద్రి జిల్లా జిల్లా తుర్కపల్లిలో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు ఓవరాక్షన్ చేశారు. ఓ లారీ డ్రైవర్ పై ఆఫీసర్లు దాడి చేశారు. ఇదే టైంలో డ్రైవర్ నబీలాల్ కు గుండెపోటు వచ్చింది. దీంతో స్థానిక హాస్పిటల్ కు తరలించే లోపే డ్రైవర్ చనిపోయాడు. ఆఫీసర్లు దాడి చేయడంవల్లే డ్రైవర్ చనిపోయాడని ఆరోపిస్తున్నారు బంధువులు. ఏపీ నుంచి గజ్వేల్ కు వెళ్తున్న DCMని చెక్ చేసిన కమర్షియల్ టాక్స్ ఆఫీసర్లు.. బిల్లులు లేవంటూ 2 లక్షలు డిమాండ్ చేశారని చెబుతున్నారు బంధువులు. అయితే డ్రైవర్ మాత్రం రూ.15 వేలు మాత్రమే ఉన్నాయని చెప్పడంతో డ్రైవర్ పై ఆఫీసుర్లు దాడి చేసినట్లు డ్రైవర్ అల్లుడు చెబుతున్నాడు. భువనగిరి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసు ముందు నబీలాల్ బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేసేంత వరకు ఆఫీసు నుంచి కదలబోమని నిరసన తెలుపుతున్నారు. బిల్లులు లేకపోతే దాడి చేసి చంపేయడం ఏంటి ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం

జిమ్నాస్టిక్ ప్లేయర్ అరుణారెడ్డికి కారు గిఫ్ట్

కేసులు పెరిగితే స్కూళ్ల మూసివేతపై నిర్ణయం!