
అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో ఇండియన్ కాన్సులేట్ తెరవాలని మేయర్ కరెన్ బాస్ భారత ప్రభుత్వాన్ని కోరారు. ప్రధాని మోదీ పర్యటనలో ఇచ్చిన హామీ మేరకు భారతీయ సంతతి ఎక్కువ ఉన్న ఎంటర్ టైన్ మెంట్ క్యాపిటల్ లాస్ ఏంజిల్స్ కాన్సులేట్ ఏర్పాటు చేయాలన్నారు. అమెరికాలో ఇప్పటికే ఐదు నగరాల్లో కాన్సులేట్ లు ఉన్నాయి. న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, చికాగో, హ్యూస్టన్ లో భారతీయ కాన్సులేట్ ఉన్నాయి.
Also Read :- గాల్లోనే చిన్నారికి వైద్యం
2023 జూన్‌లో ప్రధాని మోదీ చారిత్రక పర్యటన సందర్భంగా అమెరికాలో రెండు కొత్త కాన్సులేట్‌లను ప్రారంభిస్తుందని ప్రకటించారు. అందులో ఒకటి సీటెల్‌లో ఉంటుందని ప్రకటించారు. భారతీయ అమెరికన్ సంస్థలు, లాస్ ఏంజిల్స్ మేయర్ తమ నగరంలో రెండవ కాన్సులేట్‌ను ప్రారంభించాలని కోరుతున్నారు.