లో క్యాలరీ ఫుడ్​తో బరువు తగ్గొచ్చు

లో క్యాలరీ ఫుడ్​తో బరువు తగ్గొచ్చు

బరువు తగ్గాలని ఉంటుంది. కానీ..తిండి మానాలని ఉండదు. నిజానికి అప్పుడే ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది. అaలాంటి టైంలో తక్కువ క్యాలరీలు ఉన్న ఫుడ్ ప్రిఫర్ చేయొచ్చు అంటున్నారు న్యూట్రిషనిస్ట్‌‌‌‌లు. ఆకలి వేసినప్పుడల్లా ఈ ఫుడ్ తింటే బరువు పెరగరు. ఆకలీ తీరుతుంది.

బ్యాలెన్సింగ్ అవసరం

తక్కువ క్యాలరీలున్న ఫుడ్ ఐటమ్స్‌‌‌‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్లే డైటింగ్ టైంలో ఈ ఫుడ్ తింటే కడుపు నిం డుగా ఉంటుం ది. అయితే, వీటితో పాటు కచ్చితంగా ప్రొటీన్, మైక్రోన్యూట్రియెం ట్ ఫుడ్ కూడా తీసుకోవాలి. అప్పుడే బ్యాలెన్స్ చేయగలుగుతారు. అలాకాకుం డా తక్కువ క్యాలరీలున్న ఫుడ్ ఒక్కటే తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు. కానీ, శరీరంలో ఏదైనా డెఫిషియెన్సీ రావచ్చు. కాబట్టి ఏ ఫుడ్ తిన్నా బ్యాలెన్స్‌‌‌‌డ్‌‌‌‌గా తినా లి. వెయిట్‌‌‌‌ని బట్టి తక్కువ క్యాలరీలుండే ఫుడ్‌‌‌‌తో పాటు మినరల్స్, విటమిన్స్ ఉండే ఫుడ్ కూడా తినాలి.

కీర దోసకాయలు

బీర, దోస, గుమ్మడి, బూడిద గుమ్మడి వంటి కూరగాయల్లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వాళ్లు వీటిని డైట్ చార్ట్‌‌‌‌లో చేర్చు కోవచ్చు. బాగా ఆకలివేసినప్పుడు వీటిని తింటే మంచిది. అయితే వీటితో పాటు బ్యాలెన్స్‌‌‌‌డ్ డైట్ కూడా అవసరం.

సిట్రస్ ఫ్రూట్స్

సిట్రస్ ఫ్రూట్స్‌‌‌‌ అన్నీ క్యాలరీలున్నవే. డైటింగ్‌‌‌‌లో ఉన్నవాళ్లు వీటిని తినడం వల్ల బరువు తగ్గడమే కాకుండా ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోకుండా ఉంటాయి. డైజెషన్ సిస్టమ్‌‌‌‌ను సరిగా నడిపించడంలోనూ సిట్రస్ ఫ్రూట్స్ బాగా పనిచేస్తాయి. సిట్రస్ ఉండే కూరగాయల్లో టొమాటో, రెడ్ క్యాప్సికమ్ వంటి వాటిలో కూడా క్యాలరీలు తక్కువగా ఉంటాయి.

ఆకు కూరలు

ఆకుకూరల్లో చాలా తక్కువ క్యాలరీలుంటాయి. అందుకే అనారోగ్యంతో ఉన్నవాళ్లకు ఆకుకూరల ఫ్రై పెట్టాలంటారు. పైగా ఇవి ఈజీగా డైజెస్ట్​ అవుతాయి. అందుకే డైటింగ్ చేస్తున్నవాళ్లు ఇవి రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా తినొచ్చు.

మష్రూమ్స్

మష్రూమ్స్‌‌‌‌లో  చాలా తక్కువ క్యాలరీలుంటాయి. అందులో విటమిన్– డి, సెలీనియం ఎక్కువగా ఉంటుంది. ఎనర్జీ లెవెల్స్ పెరగాలన్నా , ఒత్తిడిని తగ్గించి నిద్ర బాగా పట్టాలన్నా ఇది బెస్ట్ ఫుడ్.

అల్లం, వెల్లుల్లి

నాన్‌‌‌‌వెజ్‌‌‌‌లో రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా వాడే అల్లం, వెల్లుల్లి పేస్ట్‌‌‌‌లోనూ చాలా తక్కువ క్యాలరీలుంటాయి. హైబీపీ, షుగర్ లెవెల్స్‌‌‌‌ను ఇవి తగ్గిస్తాయి. వీటిని కలిపి తిన్నా, విడివిడిగా తిన్నా మంచిదే. పాలు, చక్కెర లేకుండా అల్లం టీ, నానబెట్టిన వెల్లుల్లి ప్రతిరోజూ ఉదయాన్నే తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

గుడ్లు

తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలుండే ఫుడ్..గుడ్డు. ఉదయాన్నే ఒక గుడ్డు తిని రోజును ప్రారంభిస్తే  హెల్దీగా ఉంటారు. మెటబాలిజమ్‌‌‌‌ను పెంచే బూస్టర్‌‌‌‌‌‌‌‌ కూడా. అందుకే డైటింగ్ చేస్తున్న వాళ్ళు గుడ్లను ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు.

పాప్ కార్న్

లో క్యాలరీలున్న స్నాక్స్‌‌‌‌లో పాప్ కార్న్ ఒకటి. ఒక కప్పు పాప్ కార్న్ లో 31గ్రాముల క్యాలరీలు, 12 గ్రాముల ఫైబర్ మాత్రమే ఉంటాయి. అందుకే బరువు తగ్గాలి అనుకునే వాళ్లు డైట్ చార్ట్‌‌‌‌లో పాప్ కార్న్ కూడా చేర్చుకోవచ్చు.

సూప్స్

సాలిడ్ ఫుడ్‌‌‌‌లా సూప్స్ కడుపునింపుతాయి. పైగా వీటిలో చాలా తక్కువ క్యాలరీలుంటాయి. అందువల్ల డైటింగ్ చేస్తున్నవాళ్లు హెవీ ఫుడ్ తినాల్సిన టైంలో సూప్స్ తీసుకుంటే మంచిది. వీక్‌‌‌‌గా అనిపించినా సూప్స్ తాగొచ్చు. సూప్స్ ఇమిడియెట్ ఎనర్జీని అందిస్తాయి.

గ్రీన్ టీ

ఏ టైంలో అయినా గ్రీన్ టీ తాగొచ్చు. దీనివల్ల  బాడీ యాక్టివ్‌‌‌‌గా ఉంటుంది. ఈ డ్రింక్‌‌‌‌లోనూ తక్కువ క్యాలరీలు ఉంటాయి.  ఇమ్యూనిటీని పెంచడంలోనూ ఇది బాగా ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్ చేయాలనుకునే వాళ్లు డైలీ ఈ డ్రింక్ తాగొచ్చు.

నీళ్లు

తక్కువ క్యాలరీలున్న వాటిలో నీళ్ళు కూడా ఒకటి. వెయిట్ లాస్ అయ్యేందుకు ఇది పర్ఫెక్ట్ డ్రింక్. డైటింగ్ చేస్తున్న టైంలో హైడ్రేట్ కాకుండా ఉన్నా, ఈజీగా డైజెషన్ కావాలన్నా నీళ్లు ఎక్కువగా తాగాలి.