పోయిన టెన్త్ ఆన్సర్ షీట్స్.. పోస్టాఫీసు నుంచి తీసుకెళ్తుండగా పడిపోయినట్లు గుర్తింపు ​

పోయిన టెన్త్ ఆన్సర్ షీట్స్.. పోస్టాఫీసు నుంచి తీసుకెళ్తుండగా పడిపోయినట్లు గుర్తింపు ​
  • ఘటనపై ఆదిలాబాద్​ అడిషనల్‌‌ కలెక్టర్‌‌ విచారణ 
  •     ఉట్నూర్‌‌ పోస్టాఫీస్‌‌ నుంచి బస్టాండ్​కు ఆటోలో తీసుకెళ్తుండగా పడిపోయినట్లు గుర్తింపు ​
  •     ఎస్కార్ట్​ లేకుండానే తరలించారని వెల్లడి
  •     పోస్ట్​మాస్టర్​ రజిత, ఔట్​సోర్సింగ్​ ఉద్యోగి నాగరాజు సస్పెండ్​

గుడిహత్నూర్, వెలుగు: ఆదిలాబాద్‌‌ జిల్లా ఉట్నూర్‌‌లో పదోతరగతి తెలుగు ఆన్సర్​షీట్ కట్ట​ మిస్సింగ్‌‌  ఘటనపై పోలీసులు ఎంక్వైరీ ప్రారంభించారు. ఎస్కార్ట్​ లేకుండా పోస్టల్​ సిబ్బంది ఆటోలో నిర్లక్ష్యంగా ఆన్సర్​షీట్ బండిల్స్​ తరలించడం వల్లే..  ఒక బండిల్​ మిస్​అయిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఘటనలో పోస్ట్​మాస్టర్​ రజిత, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగి నాగరాజును  ఉన్నతాధికారులు మంగళవారం సస్పెండ్​చేశారు. ఉట్నూర్‌‌ జడ్పీ హైస్కూల్​లో 9 మంది స్టూడెంట్లు పరీక్ష రాశారు.  

సంబంధిత సీఎస్, డీవో ల ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం పదికిపైగా బండిల్స్​ ప్యాక్‌‌ చేసి పోస్టాఫీస్​లో ఇచ్చారు. అక్కడి నుంచి పోస్టల్​ సిబ్బంది మంచిర్యాలకు తరలించడానికి.. ప్యాసింజర్​ ఆటోలో ఎస్కార్ట్​ లేకుండా ఉట్నూర్​ బస్టాండ్‌‌కు తీసుకొచ్చారు.  అక్కడికి వెళ్లాక ఆన్సర్​ షీట్స్​ కట్టలలో ఒకటి మిస్‌‌ అయిందని గుర్తించారు. ఈ బండిల్​లో 9 మంది విద్యార్థులకు సంబంధించిన ఆన్సర్​షీట్స్​ఉన్నాయి. మంగళవారం విద్యాశాఖ అధికారులు పోలీసు స్టేషన్‌‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది.

ఆదిలాబాద్​ అడిషనల్‌‌ కలెక్టర్‌‌ రిజ్వాన్‌‌ బాషా.. ఉట్నూర్‌‌ ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చి  విచారణ చేపట్టారు. పోస్టల్‌‌ అధికారులు మంచిర్యాలకు పంపిన మిగతా పరీక్షా పత్రాల బండిల్స్​ను ట్రాక్‌‌ చేయడానికి ప్రయత్నించగా .. మంగళవారం నేషనల్‌‌ హాలిడే కావడంతో సాధ్యం కాలేదు. సీసీటీవీ ఫుటేజీని సేకరించి పరిశీలిస్తున్నామని, త్వరలోనే మిస్సయిన ఆన్సర్​షీట్​ బండిల్ వివరాలను వెల్లడిస్తామని ఆఫీసర్లు, పోలీసులు వెల్లడించారు.