ఆఫీసుల్లో పెరుగుతున్న రొమాన్స్ ధోరణి.. ప్రపంచంలో 2వ స్థానంలో భారత్..!

ఆఫీసుల్లో పెరుగుతున్న రొమాన్స్ ధోరణి.. ప్రపంచంలో 2వ స్థానంలో భారత్..!

భారతదేశంలో ఉద్యోగ ప్రదేశాల్లో ప్రేమ వ్యవహారాలు పెరుగుతున్నాయి. ఇది కొత్త తరం ఆలోచనా విధానాలు, వ్యక్తిగత స్వేచ్ఛ పట్ల పెరుగుతున్న ఓపెనెస్‌ను ప్రతిబింబిస్తోందని సర్వేలు చెబుతున్నాయి. ఇటీవల Ashley Madison, YouGov సంస్థలు చేపట్టిన సర్వేలో11 దేశాల్లో 13,581 మంది నుంచి సమాచారం సేకరించాయి. ఇందులో ఆఫీసు రొమాన్స్ విషయంలో మెక్సికో తొలి స్థానంలో ఉండగా.. ఇండియా రెండో స్థానంలో నిలిచింది. 

సర్వే ప్రకారం.. భారతదేశంలో ప్రతి 10 మందిలో నలుగురు ఉద్యోగులు తమ సహోద్యోగితో గతంలో లేదా ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్నట్టు వెల్లడించారు. అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాల్లో ఇది 30 శాతం మాత్రమే ఉండగా.. ఇండియాలో మాత్రం 40 శాతం వరకు చేరింది. అధ్యయనం ప్రకారం పురుషులు.. మహిళల కంటే ఎక్కువగా ఆఫీస్‌లో ప్రేమ బంధాలు కలిగి ఉన్నారని తేలింది. 51 శాతం పురుషులు తమ సహోద్యోగితో ప్రేమలో పడ్డారని చెప్పగా, మహిళల్లో ఇది 36 శాతం మాత్రమే ఉంది.

మహిళలు మాత్రం కెరీర్‌పై ప్రభావంచూపుతుందనే ఆందోళనతో ఇలాంటి సంబంధాల పట్ల మరింత జాగ్రత్తగా ఉంటున్నారని సర్వేలో తేలింది. 29 శాతం మహిళలు ప్రొఫెషనల్‌ పరిణామాల భయంతో వర్క్‌ప్లేస్ రిలేషన్షిప్‌లకు దూరంగా ఉంచుతున్నట్టు సర్వేలో తేలింది. వయస్సు పరంగా చూస్తే.. 18–24 ఏళ్ల యువకులు ఈ విషయాల్లో మరింత అప్రమత్తంగా ఉన్నారు. 34 శాతం మంది యువత తమ కెరీర్‌కు ప్రతికూల ప్రభావం ఉంటుందేమోనన్న ఆందోళన వ్యక్తం చేశారు. 

►ALSO READ | టైగర్ అభీ జిందా హై: అసెంబ్లీ ఫలితాల వేళ బీహార్‎ సల్మాన్ ఖాన్ అంటూ నితీష్ పోస్టర్లు

వెస్ట్రన్ కల్చర్ కారణంగా ఇండియాలో కూడా ఓపెన్ రిలేషన్‌షిప్ ధోరణి కూడా పెరుగుతోంది. Gleeden అనే డేటింగ్ యాప్‌ నిర్వహించిన సర్వే ప్రకారం.. 35 శాతం భారతీయులు ప్రస్తుతం ఓపెన్ రిలేషన్‌షిప్‌లలో ఉన్నారని, 41 శాతం మంది తమ భాగస్వామి సూచిస్తే అటువంటి సంబంధాన్ని అంగీకరించగలమని చెప్పారు. ఈ ధోరణి మెట్రోపాలిటన్ నగరాలకు మాత్రమే పరిమితం కాకుండా చిన్న పట్టణాలకూ విస్తరించింది. తమిళనాడులోని కాంచీపురం ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌ల విషయంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నట్లు గుర్తించబడింది.