బస్సునే ఇంటిలా మార్చుకున్నారు.. ఆ బస్సులోనే ప్రపంచం చుట్టేస్తున్నరు

బస్సునే ఇంటిలా మార్చుకున్నారు.. ఆ బస్సులోనే ప్రపంచం చుట్టేస్తున్నరు

ఏదైనా  ట్రిప్​ ప్లాన్​ చేస్తే బండిమీదో, బస్సులోనే ట్రావెల్​ చేస్తాం. జర్నీ కాస్త లాంగ్ అయితే ట్రైన్​ ఎక్కుతాం. అదీ కాదంటే ప్లేన్​ ఎక్కుతాం. ఇలా దూరాన్ని , కంఫర్ట్​ని   బట్టి వెహికల్​ని మారుస్తుంటాం. కానీ, ఆస్ట్రేలియాకి చెందిన  హన్నా రిప్టాన్​, హ్యారీ షా మాత్రం వేల మైళ్లని కూడా బస్సుతో చుట్టేస్తున్నారు.  ఓల్డ్​ స్కూల్​ బస్సుని  ఓ మినీ సైజు ఇల్లుగా మార్చి  ఆస్ట్రేలియాలో ఉండే అంతా చక్కెర్లు కొడుతున్నారు. ఏ ఫైవ్​ స్టార్​ హోటల్​కి తీసిపోదు  వీళ్ల బస్​. ఏసీ, ఫ్రిజ్​, వాష్​రూమ్స్​, డైనింగ్ ఏరియా, కిచెన్​ ఉన్నాయి ఈ హోమ్​ బస్​లో.

హన్నా, హ్యారీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ ట్రావెలింగ్​ ఇష్టం.  పెళ్లయ్యాక  సరదాగా  నేచర్​తో  ఓ ట్రిప్​ ప్లాన్​ చేశారు ఈ ట్రావెలర్స్​. అయితే ఐదారురోజుల ట్రిప్​ అంటేనే  70 నుంచి 80వేల డాలర్ల వరకు ఖర్చవుతుంది. రోజులు పెరిగేకొద్దీ ఆ రేటు పెరుగుతుంటుంది. అంత  డబ్బు ఖర్చు పెట్టి  ట్రావెలింగ్ చేసే స్థోమత ఈ కపుల్​కి లేదు.  అలాగే  వెళ్లిన ప్రతిచోటకీ  లగేజ్ మోత  వద్దనుకుని,  తక్కువ బడ్జెట్​లో, కంఫర్ట్​బుల్​గా  ఆస్ట్రేలియా మొత్తం చుట్టేసే ప్లాన్​ గీశారు. అందుకోసం ఓల్డ్​ స్కూల్​ బస్​ని మినీ ఇల్లుగా మార్చాలనుకున్నారు.

ఆడుతూ.. పాడుతూ

ఆలోచన రావడమే ఆలస్యం గ్రౌండ్​ వర్క్​ మొదలుపెట్టారు. నాలుగు నెలల పాటు సెర్చ్​ చేసి ఫైనల్​గా 12 మీటర్ల పొడవున్న  ఓల్డ్​ స్కూల్​ బస్​ని  2018లో  కొన్నారు. ప్రొఫెషనల్​ డిజైనర్స్​తో మాడిఫికేషన్​ అంటే ఖర్చు లక్షల డాలర్లలో అవుతుంది. అందుకే ప్రొఫెషనల్స్​  హెల్ప్​ లేకుండానే బస్సుని  ఇంటిగా మార్చే  ప్రయత్నాలు ​ మొదలుపెట్టారు. బస్సు సీట్లు తీసి ఫ్లోర్​ బోర్డ్స్​, రూఫ్​ ప్యానెల్స్​, సీలింగ్ ఫిక్స్​ చేశారు.

అన్నీ ఉన్నాయ్​

 

ఈ బస్సులో మాస్టర్​ బెడ్​రూంతో  పాటు రెండు గెస్ట్​ బెడ్స్​ కూడా ఉన్నాయి​. వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్, ఏసీ, షవర్​, కంపోజ్డ్​ టాయిలెట్, కిచెన్​​ లాంటి ఫెసిలిటీలు కూడా ఉన్నాయి. ఆరువందల లీటర్ల  కెపాసిటీ ఉన్న నీళ్ల  ట్యాంక్, ఎలక్ట్రిసిటీ  కూడా ఉంది. బస్సుకి  ఓ వ్యాన్​ని కూడా  అటాచ్​ చేశారు వీళ్లు. బస్సు వెళ్లే దారులు లేనప్పుడు  కారుని బయటకు తీస్తున్నారు.

ఫాలోవర్స్​ పెరిగారు

హన్నా, హ్యారీ కపుల్​ గోల్​కి సోషల్​ మీడియా ఇంప్రెస్​  చేసింది. వెళ్లిన ప్రతిచోటుని ఫొటోలు, వీడియోల ద్వారా సోషల్​ మీడియాలో ఎక్స్​ప్లోర్​ చేస్తున్నారు. దాంతో ఫాలోవర్స్​ సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తక్కువ ఖర్చుతో నచ్చిన చోటుకి వెళ్లాలనుకునే చాలామందికి ఈ కపుల్​ ఇన్​స్పిరేషన్​గా నిలుస్తున్నారు.
అంతేకాదు సోషల్​ మీడియాలో తక్కువ బడ్జెట్​ ట్రావెలింగ్ పాఠాలు కూడా చెప్తున్నారు వీళ్లు.