చలికాలంలో యోగా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

V6 Velugu Posted on Jan 04, 2021

పొద్దున లేస్తే ఉరుకుల పరుగులమయంగా జీవితాలు తయారయ్యాయి. గంటల తరబడి కుర్చీల్లో కూర్చోవాల్సి రావడం, రాత్రిళ్లు పని చేస్తుండటం, జంక్ ఫుడ్‌కు అలవాటు పడటం, వర్కవుట్లు చేయకపోవడంతో బరువు పెరగడం మామూలైపోయింది. దీంతోపాటు షుగర్, బీపీ, గుండె నొప్పి లాంటి వ్యాధులు కూడా వస్తున్నాయి. కాబట్టి యోగా, ధ్యానం లాంటి ప్రక్రియలను చేయడం అలవాటు చేసుకోవాలని హెల్త్ ఎక్స్‌‌పర్ట్స్ సూచిస్తున్నారు. అయితే గురువుల ఆధ్వర్యంలో వీటిని ప్రాక్టీస్ చేయాలంటే అందరికీ కుదరకపోవచ్చు. యూట్యూబ్ లాంటి వాటి నుంచి ఆసనాలు నేర్చుకొని సాధన చేసేవారి సంఖ్య ఎక్కువవుతోంది. అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. యోగ క్రియలు చేసే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.. సూక్ష్మ వ్యాయామం: చలికాలంలో వాతం, కఫం పెరగడం మామూలే. వీటి వల్ల శరీరంలో దృఢత్వం తగ్గుతుంది. వింటర్‌‌లో సాధన చేసే ముందు వార్మప్ తప్పక చేయాలి. జాయింట్ రొటేషన్స్ ఎక్కువగా చేస్తే మంచిది. సాధనకు ముందు పాదాలు, మోకాళ్లు, నడుము భాగంతోపాటు చేతులు, మోచేతులు, భుజాలు, మెడలను వార్మప్ చేయాలి. హఠ యోగ మంచిదా?: చలి కాలం గడుస్తున్న కొద్దీ వాత దోషం ఎక్కువవుతూ ఉంటుంది. దీని వల్ల శక్తిహీనం జరుగుతుంది. తిరిగి శక్తి పుంజుకోవాలంటే కొన్ని ఆసనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. హఠ యోగ లాంటివి ప్రాక్టీస్ చేస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రక్రియలో యోగ ముద్రను ఎక్కువ సేపు హోల్డ్ చేయాల్సి వస్తుంది. మీకు మీరే స్ఫూర్తి: చలికాలంలో మానవ శరీరం చాలా బలంగా మారుతుంది. యోగ ప్రాక్టీస్ చేసే సమయంలో మిమ్మల్ని మీరు చాలెంజ్ చేసుకుంటూ ముందుకు సాగాలి. ఈ శ్వాసక్రియల గురించి తెలుసా?: సీజన్‌‌తో సంబంధం లేకుండా కపాలభాతి, భస్త్రికా లాంటి క్రియలను ఎప్పుడూ ప్రాక్టీస్ చేయొచ్చు. వీటిపై పట్టు వచ్చిందని భావిస్తే అగ్నిసుర, నౌలి లాంటి క్రియలను చలికాలం ఆఖర్లో సాధన చేయొచ్చు. ప్రాణాయామం, ధ్యానం మరవొద్దు: ప్రాణాయామం, ధ్యానం యోగ సాధనలో కీలక భాగాలని చెప్పొచ్చు. కాలంతో సంబంధం లేకుండా యోగా రొటీన్‌‌లో వీటిని చేర్చుకోవాలి. ఈక్వల్ బ్రీతింగ్, డబుల్ బ్రీతింగ్, నోస్ట్రిల్ బ్రీతింగ్‌‌తోపాటు షీతాలి, చంద్ర భేద లాంటి టెక్నిక్స్‌‌ను గైడెన్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు.

Tagged hatha yoga

Latest Videos

Subscribe Now

More News