
ఆత్మకూర్, వెలుగు: ప్రేమ విఫలమై ఓ యువకుడు రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘ నేనుదూరంగా వెళ్లిపోతున్నా. ఇక నుంచి మీకు కనిపించను. అమ్మాయిలతో ప్రేమలో పడితే మోసం చేస్తారు.ప్రేమించిన అమ్మాయితో పాటు ఆమె అక్క, ఇద్దరు స్నేహితులే నా ఆత్మహత్యకు కారణం’ అని సూసైడ్లేఖ, సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. బుధవారం వనపర్తి జిల్లా శ్రీరాంనగర్రైల్వేస్టే షన్దగ్గర జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఆత్మకూరు మండలంలోని ఆరెపల్లికి చెందిన వెంకటేశ్వర్గౌడ్కుమారుడు కిరణ్ కుమార్ గౌడ్(23) ఇదే మండలం ప్రియదర్శిని గ్రామానికి చెందిన ఓ యువతిని కాలంగా ప్రే మిస్తున్నాడు. ఇద్దరు హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు. ఇటీవల యువతికి పెళ్లి కుదరడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరిగాయి. రెండు వారాలనుంచి ఆ యువతితో కిరణ్ మాట్లాడేందుకు ప్రయత్నించినా ఆమె మాట్లాడలేదు. హైదరాబాద్ నల్లకుంట పోలీస్ స్టేషన్‌లోనూ,షీ టీంకు ఫిర్యాదు చేశాడు. రెండురోజుల కింద ఆమె స్వగ్రామానికి తెలుసుకున్న కిరణ్ అక్కడికెళ్లి కలవాలని ప్రయత్నించాడు. అదీ సాధ్యం కాక మనస్తాపానికి గురైన కిరణ్ బుధవారం సాయంత్రం రైలుకు ఎదురుగా వెళ్లిఆత్మహత్యకు పాల్పడ్డాడు.శవం గుర్తించలేని స్థితిలో నుజ్జు నుజ్జయింది. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.