టాలీవుడ్లో లవ్ టు డే బ్యూటీ.. టాప్ ప్రొడ్యూసర్లు ఇంట్రెస్ట్ 

టాలీవుడ్లో లవ్ టు డే బ్యూటీ.. టాప్ ప్రొడ్యూసర్లు ఇంట్రెస్ట్ 

లవ్ టు డే సినిమాతో అందరి ప్రశంసలు అందుకున్న నటి ఇవానా. ఆ కథకు సరిపోయేలా నటించిన ఇవానా.. చాలామంది డైరెక్టర్ల దృష్టిలో పడింది. తనతో సినిమా తీయాలని చాలామంది క్యూ కడుతున్నారు. ఇవానాకు సరిపోయే కథలు రాస్తున్నారు. ఇంతటి క్రేజ్ సంపాదించిన ఇవానా త్వరలో తెలుగు సినిమాలో కనిపించనుంది. రౌడీ బాయ్స్ ఫేమ్ నటుడు, దిల్ రాజ్ మేనల్లుడు ఆశిష్ రెడ్డితో కలిసి టాలివుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

ఈ సినిమాకు సుకుమార్ కథ అందిస్తున్నాడు. విశాల్ కాశీ దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ‘సెల్ఫిష్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాకు ఇవానా  కథానాయికగా ఎంపికైంది. చైత్ర అనే క్యారెక్టర్ లో నటిస్తోంది. ఈ సంద్భంగా సినిమా బృందం శనివారం (ఏప్రిల్ 22) అధికారిక పోస్టర్‌ విడుదల చేశారు. ఈ సినిమా పూర్తిగా  హైదరాబాద్‌ షూట్ చేశారు. ఇందులో ఆశిష్  స్థానిక తెలంగాణ వ్యక్తిగా కనిపించనున్నాడు .