యంగ్ టాలెంట్‌తో.. లవ్ యూ రామ్​

యంగ్ టాలెంట్‌తో..  లవ్ యూ రామ్​

సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్‌‌ లాంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న దశరథ్.. కథను అందిస్తూ, నిర్మాతగా పరిచయమవుతున్న చిత్రం ‘లవ్ యూ రామ్’. రోహిత్ బెహల్, అపర్ణ జనార్థనన్ జంటగా నటిస్తున్నారు. డివై చౌదరి దర్శకుడు. శుక్రవారం ఈ సినిమా టీజర్‌‌ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, దర్శకుడు హరీష్ శంకర్ లాంచ్ చేశారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ ‘నార్వేలో షూట్ చేసిన ఈ సినిమా విజువల్స్ చాలా రిచ్‌‌గా ఉన్నాయి. దశరథ్ గారి స్టయిల్‌‌లో డైరెక్టర్ చౌదరి ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా ఎంటర్ టైనింగ్‌‌గా తీశారు.

ఇందులో దశరథ్ ఓ పాత్ర కూడా పోషించారు. తప్పకుండా సక్సెస్‌‌ సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నాడు. యంగ్ టాలెంట్‌‌తో తెరకెక్కించిన ఈ చిత్రం అందరికీ కనెక్ట్ అవుతుందన్నారు దశరథ్.​ తమకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పారు హీరో రోహిత్, హీరోయిన్ అపర్ణ. ఈ సినిమాకి హరీష్ శంకర్ విలువైన సూచనలు ఇచ్చాడని చెప్పాడు డివై చౌదరి.