చెరువులో దూకి ప్రేమ జంట ఆత్మహత్య

చెరువులో దూకి ప్రేమ జంట ఆత్మహత్య

 హన్మకొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఓ   ప్రేమ జంట చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే..   హన్మకొండ జిల్లా పైడిపెల్లి పరిధిలోని మద్యగూడెం చెందిన తిక్క అంజలి (25), సంగాల దిలీప్ (30) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇద్దరు కలిసి  రాయపర్తి మండల కేంద్రంలోని రామచంద్రుని చెరువులో  దూకి ఆత్మహత్య చేసుకున్నారు.  స్థానికుల సమాచారంతో  ఏసీపీ  నర్సయ్య సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.