Virat Kohli: విరాట్ నువ్ 16 ఏళ్ల మా నమ్మకం.. KGF స్టైల్‌లో కోహ్లీకి విషెష్ తెలిపిన ఆర్‌సీబీ

Virat Kohli: విరాట్ నువ్ 16 ఏళ్ల మా నమ్మకం.. KGF స్టైల్‌లో కోహ్లీకి విషెష్ తెలిపిన ఆర్‌సీబీ

ఐపీఎల్ ప్రారంభ సీజన్ 2008 నుంచి ఇప్పటివరకూ ఒకే ఫ్రాంఛైజీకి ఆడిన ఏకైక ప్లేయర్ విరాట్ కోహ్లినే. అతను మార్చి 11, 2008లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టులో చేరాడు. ఆనాటి నుంచి మొత్తం 16 సీజన్ల పాటు ఆ జట్టుకే ఆడాడు. ఈ ఏడాది జరిగే 17వ సీజన్‌లోనూ ఆ ఆజట్టుతోనే అతని ప్రయాణం. ఈ క్రమంలో తమ ఫ్రాంఛైజీ పట్ల కోహ్లి ఎంత నమ్మకంగా ఉన్నాడో చెబుతూ ఆర్‌సీబీ యాజమాన్యం ఓ స్పెషల్ వీడియో రూపొందించింది. 

విరాట్ కోహ్లీ ఆర్‌సీబీ జట్టులో చేరి 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ట్వీట్ చేసింది. అతను జట్టులోకి వచ్చిననాటి నుంచి ఇప్పటివరకూ జరిగిన అత్యుత్తమ క్షణాలను కలగలిపి ఓ వీడియోగా రూపొందించింది. ఆ వీడియోకు బ్యాక్‌గ్రౌండ్‌లో కేజీఎఫ్ మ్యూజిక్ యాడ్ చేశారు. పైగా ఆ వీడియోకు సినిమా రేంజ్‌లో ఆదిపిరిపోయే కొటేషన్ ఇచ్చారు.

"ఈ అనంత విశ్వంలో అన్నింటి కంటే నమ్మకమే గొప్పది. కింగ్ కోహ్లి, నువ్వంటే మాకు ఇష్టం.." అనే క్యాప్షన్ జోడించింది.

కోహ్లీ ఆర్‌సీబీకి ట్రోఫీ అందించనప్పటికీ, తన 16 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌లో ఎన్నో వ్యక్తిగత రికార్డులు సృష్టించాడు. 237 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో కోహ్లీ 37.24 సగటుతో మొత్తం 7263 పరుగులు చేశాడు. టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2016లో ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు (976) నమోదు చేశాడు. ఆ ఏడాదే జట్టును ఫైనల్ చేర్చాడు. 5 ఐపీఎల్ సెంచరీలు నమోదు చేశాడు.