వెబ్ సిరీస్‌‌గా లూసిఫర్

వెబ్ సిరీస్‌‌గా లూసిఫర్

ఓటీటీల్లో సినిమాలూ వస్తాయి, వెబ్ సిరీసులూ వస్తాయి. అయితే ఇప్పుడు ఒక సినిమాయే వెబ్‌‌ సిరీస్‌‌ రూపంలో రాబోతోంది. ఇది కాస్త కొత్త విషయమే. పైగా అది మామూలు సినిమా కాదు. మలయాళంలో సూపర్‌‌‌‌ హిట్టయ్యి, తెలుగులో చిరంజీవి హీరోగా రీమేక్ అవుతున్న ‘లూసిఫర్‌‌‌‌’. మోహన్‌‌లాల్ హీరోగా పృథ్విరాజ్ సుకుమారన్ డైరెక్షన్‌‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హిందీలో కూడా రీమేక్ చేయనున్నారు. అయితే సినిమాగా కాదు. ఎనిమిది ఎపిసోడ్ల వెబ్‌‌ సిరీస్‌‌గా. ఈ విషయాన్ని స్వయంగా పృథ్విరాజే తన రీసెంట్‌‌ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. ఆల్రెడీ మలయాళ ‘లూసిఫర్‌‌‌‌’కి సీక్వెల్‌‌ని అనౌన్స్ చేశాడు పృథ్వి. త్వరలో మూవీ సెట్స్‌‌కి వెళ్లనుంది. నిన్న చిరంజీవి తెలుగు రీమేక్ స్టార్ట్ చేసేశారు. మరి హిందీ ప్రాజెక్ట్ ఎప్పటికి పట్టాలెక్కుతుందో. ప్రస్తుతానికైతే డిస్కషన్స్ నడుస్తున్నాయని పృథ్వి అన్నాడు. ఎవరు నటిస్తారనేది కూడా ఇంకా కన్‌‌ఫర్మ్ చేయలేదు. మోహన్‌‌లాల్ నటిస్తారో లేదో ఇప్పుడే చెప్పలేనని అన్నాడు. ఆల్రెడీ కంపెనీ, ఆగ్ లాంటి చిత్రాల ద్వారా బాలీవుడ్ వారికి మోహన్‌‌లాల్ పరిచయమయ్యారు కాబట్టి ఆయనే యాక్ట్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. అఫీషియల్ అనౌన్స్‌‌మెంట్ వస్తే కానీ మిగతా విషయాలపై క్లారిటీ రాదు.