అనగనగా ఒక ఊరు : వజ్రాల నగరం

అనగనగా ఒక ఊరు : వజ్రాల  నగరం

ఈ ఊరు ఒకప్పుడు డైమండ్ మైనింగ్​కి పాపులర్. ఇప్పుడు నమీబియా టూరిజంలో టాప్​ టూరిస్ట్​ ప్లేస్. ఇప్పటికీ అక్కడి సముద్రంలో వజ్రాల వేట కొనసాగుతూనే ఉంది. ఆ ఊరి పేరే లూడెరిట్జ్. నమీబియాలోని ఒక చిన్న ఊరు ఇది. ఆ ఊరికే కాదు.. దాని పేరు వెనక కూడా ఒక కథ ఉంది.  

అది 1883 వ సంవత్సరం.. బర్తలోమయి దియజ్, బ్రెమెన్ టొబాకొనిస్ట్​ అడాల్ఫ్​ లూడెరిట్జ్​ అనే ఇద్దరు కలిసి సముద్రం దగ్గర ఒక ట్రేడింగ్​ పోస్ట్​ ఏర్పాటుచేశారు. దాన్ని ‘లూడెరిట్జార్ట్​’ అని పిలిచేవాళ్లు. ఆ తర్వాతి ఏడాది వ్యాపారుల కోరిక మేరకు ఆ ప్రాంతం జర్మనీ రాజ్య రక్షణలోకి​​ వెళ్లింది. 

అప్పటి వరకు పనికిరాదు అనుకున్న ఆ  నేలలో ఖనిజ సంపద దొరుకుతుందేమో అని చాలామంది ఆశపడ్డారు. వాటికోసం వెతకడం మొదలుపెట్టారు. కొంతకాలానికి కొన్ని ఆర్థిక కారణాల వల్ల అడాల్ఫ్​ లూడెరిట్జ్ అనే వ్యక్తి, సౌత్ వెస్ట్​ ఆఫ్రికాలోని​ జర్మన్​ కలొనియల్ కంపెనీకి ప్రాపర్టీని అమ్మకానికి పెట్టాడు. ఆ తర్వాత ఆ ప్రదేశానికి ‘లూడెరిట్జ్’​ అనే పేరు వచ్చింది. 

వజ్రం దొరికింది

చాలా ఏండ్లుగా లూడెరిట్జ్​ ప్రాంతంలో ఖనిజాల వేట మొదలైంది. అయితే ఎన్నో ఏండ్ల శ్రమ తర్వాత 1908లో మొదటిసారి ఒక వజ్రం దొరికింది. అది కూడా ఎంతో విలువైన వజ్రం. లూడెరిట్జ్​కి దగ్గర్లోని రైల్వే ట్రాక్​ దగ్గర ఇసుక తవ్వుతున్నప్పుడు కనిపించింది. ఆ వజ్రం చాలామందిలో ఆశలు రేకెత్తించింది. ఆ తర్వాత అక్కడ పోర్ట్​ సిటీ అభివృద్ధి చెందడానికి ఆ వజ్రమే కారణమైంది. కానీ, ఆ తరువాత కొంతకాలానికే లూడెరిట్జ్​ ట్రేడింగ్​ పోర్ట్​ సిటీ కాస్త నార్త్​ స్వకొప్​మండ్​గా మారింది. అక్కడ ట్రేడింగ్​ జరగడం ఆగిపోయింది. 

ఆ తర్వాత మొదటి ప్రపంచయుద్ధం జరగడంతో దక్షిణాఫ్రికా ​ ట్రూప్​లు లూడెరిట్జ్​ పోర్ట్​ని ఆక్రమించాయి. యుద్ధం ముగిశాక ఆ చిన్న ఊరు దక్షిణాఫ్రికాలో భాగమైపోయింది. లూడెరిట్జ్ ఇప్పుడు ఖారాస్​ ప్రాంతంలో ఉంది. జర్మనీలో అతి తక్కువ మంది జనాభా ఉన్న ప్రాంతం అది. చిన్న గ్రామమే అయినప్పటికీ సిటీ స్కేప్​లు, అద్భుతమైన ఆర్కిటెక్చర్​ భలే అందంగా ఆకట్టుకుంటాయి.

ఇక్కడి వాళ్లు చేపలు పట్టడం, ​ఆల్చిప్పల పెంపకం, టూరిజం వంటి వాటి మీద ఆధారపడి జీవిస్తారు. డైమండ్స్ వెతికేందుకు సముద్రంలోకి ప్రత్యేకమైన షిప్పుల్లో వెళ్తుంటారు. ఊరు చిన్నదైనా చాలా శుభ్రంగా, అందంగా ఉంటుంది. సేఫ్​ ప్లేస్​ కూడా. 

రిచ్ సిటీ టు ఘోస్ట్ సిటీ

లూడెరిట్జ్​ టూర్​కి వెళ్తే గోస్ట్​ టౌన్​ కూడా చూసి రావాల్సిందే. దాని పేరు కొల్మన్​స్కొప్. ఇది లూడెరిట్జ్​కి పది కిలో మీటర్ల దూరంలో ఉన్న నిర్మానుష్య ప్రదేశం. వజ్రాల వేట జరిగే టైంలో ఈ ఊరికి ఆఫ్రికాలోనే రిచెస్ట్​ సిటీగా పేరు. ఎడారిలో ఉన్న ఆ బిల్డింగ్​లు కూడా ఎంతో బాగుండేవి. జర్మన్​ మోడల్​లో కట్టిన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్, హాస్పిటల్, షాప్స్ వంటివన్నీ రాతి కట్టడాలే. డైమండ్ మైనింగ్ నమీబియాలోని వేరే ప్రాంతాలకు షిఫ్ట్​ అయ్యాక ఈ ఊరి నుంచి ప్రజలు వెళ్లిపోయారు. దాంతో నిర్మానుష్యంగా తయారైంది. అప్పటి నుంచి దీన్ని ఘోస్ట్​ టౌన్ అని పిలుస్తున్నారు. ఈ ఊరిని చూడాలంటే లూడెరిట్జ్​నుంచి గైడ్​ని వెంట పెట్టుకుని వెళ్లొచ్చు.  

చూడాల్సినవి 

రాక్ చర్చ్​

డైమండ్ మౌంటెన్​ మీద రాక్​ చర్చ్​ ఉంది. దీన్ని కట్టేందుకు వాడిన ఇసుక, కాంక్రీట్ జర్మనీ నుంచి షిప్స్​లో తెప్పించారు. చర్చ్ లొకేషన్​ నుంచి సిటీ వ్యూ బాగుంటుంది. 

గోయెర్కె హౌస్

జర్మనీ ఆఫీసర్​ హ్యాన్స్ గోయెర్కె కోసం ఒక ఇంటిని కట్టారు. ఆయన సర్వీస్​ పూర్తయ్యాక అక్కడే ‘ డైమండ్​ కంపెనీ’ పెట్టుకుని దానికి హెడ్​గా ఉన్నాడు హ్యాన్స్. ప్రస్తుతం ఆ బిల్డింగ్​ని గెస్ట్​ హౌస్​లా వాడుతున్నారు. ఈ బిల్డింగ్​ నమీబియా నేషనల్ మాన్యుమెంట్స్​ లిస్ట్​లో కూడా చేరింది.
 
లూడెరిట్జ్​ మ్యూజియం

ఈ మ్యూజియంలో పోర్ట్​ సిటీ చరిత్ర, డెవలప్​మెంట్​కి సంబంధించిన ఆధారాలు ఉంచారు. ఇక్కడ జియాలజీ, ఆర్కియాలజీ స్టూడెంట్స్​కి చాలా ఆసక్తికరమైన సమాచారం దొరుకుతుంది. 

లూడెరిట్జ్​ ట్రైన్ స్టేషన్ 

లూడెరిట్జ్​లో1904లో ట్రైన్​ స్టేషన్ కట్టారు. పోర్ట్​ సిటీని లోతట్టు ప్రాంతాలకు కనెక్ట్ చేసేందుకు దీన్ని కట్టారు. రైల్వే లైన్​ని హెరెరో, నామా ట్రైబ్స్​ మొదట్లో ట్రాన్స్​పోర్ట్​ వెపన్స్​గా వాడేవారు. ఆ రైలు మార్గం డైమండ్ మైనింగ్ జరిగే చోటుకు వెళ్తుంది. ఇప్పుడు ట్రాన్స్​ నమీబ్​ రైల్వే కంపెనీ 300 కిలో మీటర్ల నుంచి మాంగనీస్ ఓర్​ని ట్రాన్స్​పోర్ట్ చేస్తోంది. నెలకు కొన్ని టన్నుల మాంగనీస్ రవాణా జరుగుతోంది.

చేయాల్సినవి

క్రూయిజ్ షిప్​ టూర్లు 

ఈ ఊళ్లో స్మాల్, మీడియం క్రూయిజ్ షిప్​లు తిరుగుతుంటాయి. కాబట్టి బడ్జెట్​ని బట్టి ఎవరికి నచ్చిన వాటిని వాళ్లు సెలెక్ట్​ చేసుకుని ఎంజాయ్​ చేయొచ్చు. డిసెంబర్​ నుంచి మార్చి వరకు క్రూయిజ్​ సీజన్​. అప్పుడు షిప్ జర్నీ బాగుంటుంది. క్రూయిజ్​ షిప్​లో తిరుగుతూ పెంగ్విన్​ కాలనీలు, సముద్ర వాతావరణం, ల్యాండ్​స్కేప్​లు, సముద్ర జీవులు, పక్షుల్ని చూడొచ్చు. పెంగ్విన్​లను చూడటానికి పెంగ్విన్​ ఐలాండ్​కు టూర్ వేయొచ్చు. 
 

ఆ ఐలాండ్​ని ‘హలిఫాక్స్ ఐలాండ్​’ అని కూడా అంటారు. అక్కడ పెంగ్విన్​లతో పాటు డాల్ఫిన్​, పక్షులు, సీల్స్, తిమింగలాలు కనిపిస్తాయి. బోట్​ టూర్​ చేసే వాళ్లు ‘దియజ్ పాయింట్​, లైట్​ హౌస్​’  చూడొచ్చు. నమీబియా అడవి గుర్రాలు చూడాలంటే గారుబ్​ విలేజ్​కి వెళ్లాలి. ఇది లూడెరిట్జ్​ నుంచి వంద కిలో మీటర్ల దూరంలో ఉంటుంది​. అడవి గుర్రాలను ఇక్కడ వాళ్లు పెంచుతారు. ఇంతకు ముందు డైమండ్​ గనులు ఉన్న చోట ఇప్పుడు దాదాపు వంద రకాల జంతువులు ఉన్నాయి. 

1986 లో ఈ ప్రాంతం నేషనల్ పార్క్​ హోదా సంపాదించింది. ఆ తర్వాత ఐదేండ్లు కరువు వచ్చింది. దాంతో ఎడారి ప్రాంతంలోని జంతువులన్నీ అంతరించిపోసాగాయి. గారుబ్​లో గుర్రాలకు మాత్రం నీళ్లు అందుబాటులో ఉంచారు.