
లూథియానా: కరోనాతో పంజాబ్‌లోని లూథియానా ఏసీపీ అనిల్ కోహ్లీ శనివారం మృతి చెందారు. దీంతో ఆయన ఫ్యామిలీ మెంబర్స్‌తోపాటు పలువురు పోలీసులను అధికారులు క్వారంటైన్‌కు తరలించి టెస్టులు చేస్తున్నారు. లూథియానాలో అసిస్టెంట్ కమిషనరల్ ఆఫ్‌పోలీస్ (ఏసీపీ)గా పనిచేస్తున్న అనిల్ కోహ్లీకి ఏప్రిల్ 13న కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయింది. దీంతో ఆయన స్థానిక ఎస్పీఎస్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. రోజురోజుకు ఏసీపీ ఆరోగ్యం క్షీణిస్తుండడంతో శనివారం ఆయనకు ప్లాస్మా థెరపి చేయాలని నిర్ణయించారు. ఇంతలోనే ఆయన ఆర్గాన్స్ ఒక్కొక్కటిగా ఫెయిల్యూర్ అయ్యాయి. దీంతో ఆయన శనివారం మృతి చెందారు. ఏసీపీ అనిల్కోహ్లీ లూథియానాలోని మెయిన్ వెజిటేబుల్మార్కెట్లో డ్యూటీ చేసేవారు. ఏసీపీ ద్వారా అతడి భార్య, డ్రైవర్, ఎస్హెచ్ఓ, ఏఎస్ఐకి కూడా కరోనా సోకినట్టు అధికారులు గుర్తించారు. చురుగ్గా పనిచేసే ఓ అధికారిని డిపార్ట్మెంట్ కోల్పోయిందని పోలీస్ కమిషనర్ రాకేశ్ అగర్వాల్ అన్నారు.