న్యూఢిల్లీ: ఇండిగో ఎయిర్ లైన్స్‌కు చెందిన 500కు పైగా విమానాలు ఒకేసారి క్యాన్సిల్ కావడంతో పలు ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండిగో సంస్థ తమను మెంటల్ టార్చర్ పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, లగేజీని తిరిగి తీసుకోవడానికి ప్రయాణికులు పడరానిపాట్లు పడుతున్నారు. కొన్ని వేల సూట్‌కేసులు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ టర్మినల్‌లో పడి ఉండటంతో.. తమ లగేజీ ఎక్కడ ఉందో వెతుక్కుంటున్నరు.
చాలా మంది గంటల తరబడి ఎయిర్‌పోర్ట్‌లో వెయిట్ చేస్తుండటంతో, ఫుడ్, వాటర్ లేక ఇబ్బందులు పడుతున్నారు. మరికొంత మంది ఫ్లోర్‌పైనే నిద్ర పోతున్నారు. ఇండిగో సిబ్బంది ప్రయాణికులకు ఎలాంటి సహకారం అందించకపోవడంతో సంస్థకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేస్తున్నారు.
గంటల తరబడి ఎయిర్‌పోర్ట్‌లో వెయిట్ చేస్తున్న ఫ్లైట్స్ ఆలస్యంపై ఇండిగో సంస్థ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదంటూ ప్రయాణికులు అంటున్నారు. ఇండిగో వరస్ట్ ఎయిర్ లైన్ సంస్థ అని కోప్పడుతున్నారు. పుణె, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ తదితర ఎయిర్‌పోర్టుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ప్రయాణికులకు ఇండిగో ఎయిర్ లైన్స్ క్షమాపణలు చెప్పింది.
