కంటి నొప్పి చికిత్స కోసం.. లుపిన్ జనరిక్ మందు

కంటి నొప్పి చికిత్స కోసం.. లుపిన్ జనరిక్ మందు

న్యూఢిల్లీ: కంటి ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లమేషన్, నొప్పి చికిత్సలో వాడేందుకు  లోటెప్రెడ్నోల్ ఎటబోనేట్ ఆప్తాల్మిక్ సస్పెన్షన్  అనే జెనరిక్ మందును యూఎస్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో లాంచ్ చేశామని లుపిన్ ఫార్మా  బుధవారం ప్రకటించింది. ఈ డ్రగ్‌ బాష్ అండ్ లాంబ్​కు చెందిన లోటెమాక్స్ ఆప్తాల్మిక్ సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌కు  బయో ఈక్వివలెంట్. 

కంటి ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ తర్వాత ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లమేషన్, అలర్జిక్ చికిత్సలో  ఈ మందును వాడతారు. ఐక్యూవీఐఏ మ్యాట్‌‌‌‌‌‌‌‌ తాజా రిపోర్ట్ ప్రకారం, ఈ మందుకు సంబంధించి  యూఎస్‌‌‌‌‌‌‌‌లో ఏడాదికి 55 మిలియన్ డాలర్ల విలువైన సేల్స్ జరుగుతున్నాయి. లుపిన్ షేర్లు బుధవారం బీఎస్‌‌‌‌‌‌‌‌ఈలో 1.04శాతం తగ్గి  రూ.1,931.10 వద్ద  క్లోజయ్యాయి.