కాస్ట్​లీ కార్లకు ఫుల్‌ గిరాకీ

కాస్ట్​లీ కార్లకు ఫుల్‌ గిరాకీ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: మనదేశంలో లగ్జరీ కార్లకు డిమాండ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. ప్రపంచ దిగ్గజ ఆటోమోబైల్ కంపెనీలన్నీ ఇండియన్ లగ్జరీ కారు మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కన్నేశాయి. నెలకో కొత్త మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మార్కెట్లో ప్రవేశపెడుతున్నాయి. మార్కెట్లోకి ఏ కొత్త కారు వచ్చినా దాన్ని తీసుకోవాలని ధనవంతులు కోరుకుంటుండటమే ఇందుకు ప్రధాన కారణం. లగ్జరీ కార్లు అనగానే ముందుగా గుర్తొచ్చేది మెట్రో నగరాలు.

ఆయా నగరాల్లో వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, స్పోర్ట్స్ స్టార్లతోపాటు ధనవంతులు తిరిగేది లగ్జరీ కార్లలోనే. అయితే లగ్జరీ కారు యూజర్లలో అత్యధికులు తమ కార్లను మూడేళ్ల కంటే ఎక్కువ వాడటం లేదు. ఏదైనా కొత్త మోడల్ రాగానే తమ పాత కారుని అమ్మేసి కొత్తది కొనేస్తున్నారు. లగ్జరీ కార్లు స్టేటస్ సింబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారడంతో ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొంటున్నారు. దీంతో లగ్జరీ కారు మార్కెట్ మంచి జోష్ లో ఉంది.

మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఇండియా లగ్జరీ కార్ల మార్కెట్ లో జర్మనీకి చెందిన మెర్సిడెస్ బెంజ్ 38 శాతం వాటాతో మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్ గా ఉంది.  గతేడాది దేశవ్యాప్తంగా మొత్తం 15 వేల 538 కార్లను అమ్మింది.  బీఎండబ్ల్యూ 26 శాతం మార్కెట్ షేర్ తో సెకండ్ ప్లేస్ లో ఉంది.11శాతం మార్కెట్ షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆడి కార్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూడోస్థానంలో ఉంది. గత ఏడాది ఇది ఆరువేల 463 కార్లను అమ్మింది. అయితే ఇండియన్ లగ్జరీ మార్కెట్లో ఆధిపత్యం కొనసాగిస్తున్న ఈ మూడు కంపెనీలు జర్మనీవే కావడం విశేషం. ఈ మూడింటికి 75 శాతం మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాటా ఉంది. అలాగే బ్రిటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన జాగ్వార్ గత ఏడాది నాలుగువేల 596 కార్లని ఇండియన్ మార్కెట్లో అమ్మగా  ఆ తర్వాత స్వీడన్ కి చెందిన కంపెనీ వోల్వో కూడా ఎస్ యూవీ సెగ్మెంట్లో పుంజుకుని మొత్తంగా రెండు వేల 638 కార్లని అమ్మింది.  పోర్ష్, బెంట్లీ, రోల్స్ రాయ్స్ కార్ల అమ్మకాలు కూడా బాగానే ఉన్నాయి. 2017 లో దేశవ్యాప్తంగా 38వేల లగ్జరీ కార్లు అమ్ముడుపోగా 2018 లో 40వేల 618 కార్లు అమ్ముడయ్యాయి. ఇక 2019 లో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది.

హైదరాబాద్​లో లగ్జరీ కార్ల హవా

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ లగ్జరీ కార్లకి డిమాండ్ బాగా పెరిగింది. అన్ని లగ్జరీ కార్ల కంపెనీలకు చెందిన షోరూమ్స్ ఇక్కడ ఉన్నాయి. బీఎండబ్ల్యూ, బెంజ్, ఆడి, వోల్వో లకు చెందిన షోరూమ్స్ ఇప్పటికే ఉండగా. గత ఏడాది బెంట్లీ కూడా బంజారాహిల్స్ లో షోరూమ్ ఓపెన్ చేసింది. ఢిల్లీ, ముంబయి తర్వాత మూడో షోరూమ్ ఇక్కడ ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా డిల్లీ, ముంబయి తర్వాత లగ్జరీ కార్లు ఎక్కువగా అమ్ముడు పోయేది హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే! సౌత్ ఇండియాలో హైదరాబాద్ లీడర్ కాగా తదనంత స్థానాల్లో బెంగుళూరు, చెన్నై, కోయంబత్తూర్ సిటీలు ఉన్నాయి. లగ్జరీ కార్లలో ఎక్కువగా ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూవీ సెగ్మెంట్ కార్లు అమ్ముడుపోతున్నాయి. 50శాతానికి పైగా లగ్జరీ కార్లు ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూవీ సెగ్మెంట్ లోనే ఉన్నాయి.

ఆ తర్వాత స్పోర్ట్స్, క్రాసోవర్ సెగ్మెంట్ కార్ల సేల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇండియన్ లగ్జరీ కార్ల మార్కెట్ లీడర్ గా ఎదగడానికి ఈ ఏడాది12 కార్లు తీసుకొస్తామని బీఎండబ్ల్యూ ప్రకటించింది . 2019 లో ఇప్పటికే ఎక్స్4, జెడ్4 మోడళ్లను తీసుకురాగా ఇటీవల ముంబయిలో ఎక్స్ 5 సిరీస్ నుంచి మూడు కార్లను లాంచ్ చేసింది.  త్వరలో బీఎండబ్ల్యూ సీకేడీ ఎక్స్7, ఆల్ న్యూ ఎక్స్6, 3సిరీస్, 7 సిరీస్ తో పాటు ఎక్స్1 మోడల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకొస్తామని బీఎండబ్ల్యూ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.