35 - చిన్న కథ కాదు .. సినిమా నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

35 - చిన్న కథ కాదు .. సినిమా నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌‌‌‌లో నంద కిషోర్ ఈమాని తెరకెక్కించిన చిత్రం ‘35 - చిన్న కథ కాదు’. రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్నారు. 

బుధవారం ఈ చిత్రం నుంచి ‘నీలి మేఘములలో’ అనే పాటను విడుదల చేశారు.  వివేక్ సాగర్ కంపోజ్ చేసిన ఈ పాటను పృథ్వీ హరీష్ పాడాడు. మనసుకి హత్తుకునేలా భరద్వాజ్ గాలి లిరిక్స్ రాశాడు. లీడ్ పెయిర్ జర్నీని ఈ పాటలో ఎంతో అందంగా ప్రజెంట్ చేశారు. సెప్టెంబర్ 6న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.