బాల్య వివాహ రహిత జిల్లాగా రాజన్నసిరిసిల్ల : ఎం.చందన

బాల్య వివాహ రహిత జిల్లాగా రాజన్నసిరిసిల్ల :  ఎం.చందన
  • చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ కమిషన్  మెంబర్ ఎం.చందన

రాజన్న సిరిసిల్ల,వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లాను బాల్య వివాహాల రహిత జిల్లాగా మార్చాలని స్టేట్ చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ కమిషన్ మెంబర్ ఎం.చందన అన్నారు. మిషన్ వాత్సల్యలో భాగంగా బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాల నిర్మూలన తదితర అంశాలపై కలెక్టర్ గరిమా అగ్రవాల్‌‌‌‌తో కలిసి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిదేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. 

బాల కార్మికులు, అనాథలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. స్కూళ్లు, హాస్టళ్లలో గుడ్ టచ్.. బ్యాడ్ టచ్,  సైబర్ నేరాలు, డ్రగ్స్‌‌‌‌ వల్ల కలిగే దుష్ప్రభావాలపై, 1098 హెల్ప్ లైన్‌‌‌‌పై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో  సీడబ్ల్యూసీ చైర్మన్ అంజయ్య, డీఆర్డీవో శేషాద్రి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, డీవీహెచ్‌‌‌‌వో రవీందర్ రెడ్డి, డీఈవో వినోద్ కుమార్, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.