పీఆర్టీయూటీ రాష్ట్ర అధ్యక్షుడిగా చెన్నయ్య

పీఆర్టీయూటీ రాష్ట్ర అధ్యక్షుడిగా చెన్నయ్య

హైదరాబాద్, వెలుగు: ప్రోగెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ (పీఆర్టీయూటీ) రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎం. చెన్నయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బి. రత్నాకర్ ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్​లోని రంగారెడ్డి జడ్పీ ఆఫీసులో పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడారు. పీఆర్టీయూటీ పేరుతో రెండు వేర్వేరుగా ఉన్న సంఘాలను ఒక్కటిగా విలీనం అయినట్టు చెప్పారు. సీపీఎస్​ను రద్దు చేయాలని, పీఆర్సీని తక్షణమే ప్రకటించాలని తీర్మానించినట్టు వెల్లడించారు. పెండింగ్ లో ఉన్న టీచర్ల బిల్లులను వెంటనే రిలీజ్ చేయాలని, అన్ని మండలాలకు ఎంఈఓ పోస్టులు మంజూరు చేయాలని కోరారు.