హరిత విప్లవ పితామహుడు.. ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత

 హరిత విప్లవ పితామహుడు.. ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత

హరిత విప్లవ పితామహుడు,  వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్‌ఎస్ స్వామినాథన్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు98 ఏళ్లు. 2023 సెప్టెంబర్ 28నల చెన్నైలోని తన నివాసంలో  ఉదయం 11 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన అసలు పేరు మొన్కొంబు సాంబశివన్ స్వామినాథన్.   1925 ఆగస్టు 7న జన్మించిన స్వామినాథన్ .. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం లో చేరి వ్యవసాయ శాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీని పొందాడు.  వ్యవసాయ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకురావాలని ఆకాంక్షించిన ఆయన చివరి శ్వాస వరకూ అందుకోసమే కృషి చేశారు.

ALSO READ: స్వామినాథన్ వ్యవసాయంలో చేసిన అద్భుతం ఇదీ.. కోట్ల మంది ప్రాణాలు కాపాడారు..!

ఆయన చేసిన కృషికి గానూ భారత ప్రభుత్వం  పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.  స్వామినాథన్ సారధ్యంలో 68 మంది విద్యార్థులు పి.హెచ్.డి చేశారు. వ్యవసాయ రంగంలో స్వామినాథన్ చేసిన కృషికి గుర్తింపుగా అనేక పురస్కారాలు లభించాయి. ఎక్కువ ఉత్పత్తి చేసే వరి, ఇతర విత్తనాలను సృష్టించటంలో ఆయన కృషి ఎనలేనిది. భారత దేశం ఇవాళ పచ్చగా ఉంది అంటే.. వ్యవసాయ రంగంలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలే కారణం. ఆధునిక పద్దతులతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చగలిగారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంట దిగుబడి వచ్చే విధంగా కొత్త వంగడాలను సృష్టించారు స్వామినాథన్.