సూర్యాపేట, వెలుగు : ఆత్మకూర్ (ఎస్ )గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సమైక్య జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీజ అధికారులను కోరారు. ఈ మేరకు విద్యార్థినులతో సహా శ్రీజ మంగళవారం కలెక్టర్ వెంకట్రావు, డిపో మేనేజర్ శ్రీనివాసులును కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆత్మకూర్(ఎస్) గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో ఇంటర్, డిగ్రీ విద్యార్థులు చదువుకు దూరమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. డిపో మేనేజర్ తో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పిస్తామని కలెక్టర్ చెప్పినట్లు తెలిపారు. వినతిపత్రం ఇచ్చినవారిలో సమైక్య జిల్లా ఉపాధ్యక్షులు కుసుమశ్రీ , కోశాధికారి మనీషా, భవాని, మాధవి, అభిశ్రీ, శ్రావణి, మహేశ్వరి, అఖిల, సమీనా, లావణ్య, ఎంవీ ఫౌండేషన్ సభ్యులు తదితరులు ఉన్నారు.