
సుధీర్ బాబు హీరోగా ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్‌తో అభిలాష్ రెడ్డి రూపొందించిన చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సుధీర్ బాబు చెప్పిన విశేషాలు.
“అభిలాష్ కథ చెప్పినప్పుడు చాలా ఫ్రెష్‌గా అనిపించింది. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్‌పై చాలా సినిమాలు వచ్చాయి. అయితే కంప్లీట్ ఫాదర్ ఎమోషన్ ఉన్న సినిమాలు రేర్. ఇద్దరు తండ్రులు, ఒక కొడుకు కథ అయితే ఇంతముందు ఎప్పుడూ రాలేదు. ఒక రకంగా ఫాదర్ అండ్ సన్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. మన అందరికీ సూపర్ హీరో నాన్నే. ఇందులో హీరో.. తండ్రిని విపరీతంగా ప్రేమిస్తాడు. ఈ ఎమోషన్ చాలా నేచురల్‌గా వచ్చింది. తండ్రిని చూసుకోవడానికి కొడుకు పడే తపన ఇంటరెస్టింగ్‌గా ఉంటుంది.
హ్యూమన్ రిలేషన్స్ మీద ఉన్న యూనివర్సల్ పాయింట్ కావడంతో తప్పకుండా అందరికీ కనెక్ట్ అవుతుంది. కొన్ని ఇంటెన్స్ సీన్స్ కూడా ఉంటాయి. అలాగే సినిమా చూస్తున్నంతసేపు ఆడియెన్స్ ఫేస్‌లో ఓ స్మైల్ ఉంటుంది. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఫిల్మ్. నా కెరీర్‌లో మోస్ట్ సాటిస్ ఫైయింగ్ సినిమా ఇది. ఫస్ట్ డే నుంచే యునానిమస్‌గా ఆడియెన్స్, క్రిటిక్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తుందని కాన్ఫిడెన్స్ ఉంది. సాయి చంద్, సాయాజీ షిండే చేసిన ఫాదర్ క్యారెక్టర్స్ ఎమోషనల్‌గా ఉంటాయి.
ఇద్దరూ ఫెంటాస్టిక్ యాక్టర్స్. సాయాజీ ఇప్పటివరకు ఎప్పుడూ చేయని ఫ్రెష్ క్యారెక్టర్ చేశారు. సాయి చంద్ పాత్రలో ఫన్ ఎనర్జీ ఉంటుంది. దాన్ని ఆడియెన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. హీరోయిన్ ఆర్ణతో -లవ్ ట్రాక్ ఉంటుంది కానీ చాలా తక్కువ. బేసిగ్గా హీరో, హీరోయిన్ మధ్య జరిగే లవ్ స్టోరీ లో పేరెంట్స్ పార్ట్ సపోర్ట్‌గా ఉంటుంది. ఇందులో మాత్రం ఫాదర్ సన్ మధ్య జరిగే లవ్ స్టోరీ లో హీరోయిన్ సపోర్టివ్‌గా ఉంటుంది. యూవీ క్రియేషన్స్ నా ఫ్రెండ్స్. ఈ బ్యానర్‌లో సినిమా చేయడం నైస్ ఫీలింగ్. ఇలాంటి సెన్సిటివ్ స్టోరీ ఉన్న సినిమాతో హిట్ కొడితే వచ్చే కిక్ వేరు. ఇక ట్రైలర్ చూసిన మహేష్ గారు చాలా అప్రిషియేట్ చేశారు. హార్ట్ టచ్చింగ్ అన్నారు’’.