
మాఊరి పొలిమేర2(Maa Oori Polimera2).. ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రెండేళ్ల క్రితం డైరెక్ట్ ఓటీటీలో రిలీజై.. ఆడియన్స్ మైండ్ బ్లాక్ చేసిన మా ఊరి పొలిమేర(Maa Oori Polimera) సినిమాకు సీక్వెల్ గా వస్తోంది మాఊరి పొలిమేర2. సత్యం రాజేష్(Sathyam Rajesh), బాలాదిత్య(Baladithya), గెటప్ శీను(Getup sreenu) ప్రధాన పాత్రలో, అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన మాఊరి పొలిమేర సినిమా అనూహ్య విజయాన్ని సాధించింది. ఈ సినిమా ఆడియన్స్ వెన్నులో వణుకుపుట్టించింది. బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాలో.. ఒక్కో సీన్, ఒక్కో షాట్ ఒళ్ళు గగుర్పొడిచేలా చేసింది. ఇక క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్ అయితే నెక్స్ట్ లెవల్.
ఇక అప్పటి నుండి ఈ సినిమా సీక్వెల్ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా ఫ్యాన్స్. వారి ఎదురుచూపులకు ఫులిస్టాప్ పెడుతూ.. తాజాగా మాఊరి పొలిమేర2 నుండి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ కూడా ఆడియన్స్ ను తెగ భయపెడుతోంది. ఫస్ట్ పార్ట్ కు మించి ఈ టీజర్ ఉంది. ఇక టీజర్ చివర్లో వచ్చే.. "చంపితే తప్పు కానీ.. బలి ఇస్తే తప్పేంటి" అనే డైలాగ్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. చాలా ఇంట్రెస్టింగ్ గా సాగిన ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రేండింగ్ గా మారింది.
ఇక మొదటి పార్టీ ను తెరకెక్కిచిన అనీల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీకృష్ణ క్రియేషన్స్ పతాకంపై గౌరీ కృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మొదటి పార్టీతో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసిన మాఊరి పొలిమేర టీమ్.. సీక్వెల్ తో ఎలాంటి అనుభూతిని అందించనున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.