‘జిన్నా’గా వచ్చేందుకు రెడీ అవుతున్న మంచు విష్ణు

‘జిన్నా’గా వచ్చేందుకు రెడీ అవుతున్న మంచు విష్ణు

లాస్ట్ ఇయర్ ‘మోసగాళ్లు’ చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చిన మంచు విష్ణు.. ఈ ఇయర్ ‘జిన్నా’గా వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గాలి నాగేశ్వరరావు క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో కనిపించనున్నాడు విష్ణు. పాయల్ రాజ్‌‌‌‌పుత్ హీరోయిన్. సన్నీ లియోన్, వెన్నెల కిశోర్, సునీల్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.  కోన వెంకట్ కథ, స్ర్కీన్‌‌‌‌ప్లే అందించడంతో పాటు  క్రియేటివ్ ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌గానూ వ్యవహరిస్తున్నారు.

అనూప్‌‌‌‌ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంతో విష్ణు కూతుళ్లు అరియానా, వివియానాలు సింగర్స్‌‌‌‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 5న రిలీజ్ కానుంది. తాజాగా ఈ విషయాన్ని మంచు విష్ణు స్వయంగా రివీల్ చేశాడు. దసరా సీజన్‌‌‌‌ కావడంతో ఇప్పటికే ఈ డేట్‌‌‌‌కి  చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, నాగార్జున ‘ద ఘోస్ట్’ సినిమాలు ముహూర్తాలు పెట్టుకున్నట్టు తెలిసింది. సంతోష్ శోభన్ నటించిన ‘అన్నీ మంచి శకునములే’ కూడా అప్పుడే రానుందని సమాచారం. ముందు ముందు మరికొన్ని సినిమాలు కూడా ఈ లిస్టులో చేరే అవకాశం ఉంది. మరి దసరా రేసులో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి .