కొత్త ప్రాజెక్టుల కోసం మాక్రోటెక్​ డెవలపర్స్​రూ. 4,500 కోట్ల పెట్టుబడి

కొత్త ప్రాజెక్టుల కోసం మాక్రోటెక్​ డెవలపర్స్​రూ. 4,500 కోట్ల పెట్టుబడి

న్యూఢిల్లీ:  రియల్టీ కంపెనీ మాక్రోటెక్ డెవలపర్స్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 4,500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.   ముంబై కేంద్రంగా పనిచేసే ఈ లిస్టెడ్​ కంపెనీ, లోధా బ్రాండ్ కింద బిజినెస్‌‌ను ఆపరేట్ చేస్తోంది.  వడ్డీ రేట్లు, ఇండ్ల ధరలు పెరిగినప్పటికీ రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు డిమాండ్ బలంగా కొనసాగుతోందని మాక్రోటెక్ డెవలపర్స్ ఎండి  సీఈఓ అభిషేక్ లోధా పేర్కొన్నారు.

2022–-23 లో అమ్మకాలు,  బుకింగ్‌‌‌‌‌‌‌‌లు 34 శాతం పెరిగి రూ.12,014 కోట్లకు చేరాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20 శాతం వృద్ధితో రూ.14,500 కోట్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. కంపెనీ దగ్గర రూ. 4,600 కోట్ల విలువైన నెట్​ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో మిగులు ఉందన్నారు. మిగులు డబ్బును భూములను కొనడానికి, అప్పులు చెల్లించడానికి వాడామన్నారు.  "2022–-23  ఆర్థిక సంవత్సరంలో ప్రాజెక్టుల నిర్మాణం కోసం రూ. 3,300 కోట్లకుపైగా ఖర్చు చేశాం.

 ఈ  ఆర్థిక సంవత్సరంలో ఇది మరింత పెరుగుతుంది. దాదాపు రూ.4,300-– 4500 కోట్ల వరకు ఇన్వెస్ట్​ చేస్తాం ” అని లోధా చెప్పారు.   ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), పుణే మార్కెట్లలో తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరిస్తామని ఆయన తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే బెంగళూరులో రెండు ప్రాజెక్టులను కూడా ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. మాక్రోటెక్ డెవలపర్స్​కు ఈ మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్​లో ఏకీకృత నికర లాభం 39 శాతం పెరిగి రూ.744.36 కోట్లకు చేరుకుంది.