మేడిన్ ఖమ్మం ...మహిళా మార్ట్ పేరుతో సూపర్ మార్కెట్ ఏర్పాటు

మేడిన్ ఖమ్మం ...మహిళా మార్ట్  పేరుతో సూపర్ మార్కెట్ ఏర్పాటు
  • మహిళా సంఘాల ఉత్పత్తుల అమ్మకానికి కలెక్టర్ ప్రత్యేక చర్యలు 
  • 'ఖమ్మం మహిళా మార్ట్' పేరుతో 
  • సూపర్ మార్కెట్ ఏర్పాటు 
  • బ్రాండింగ్ కోసం ప్రత్యేకలోగో రూపకల్పన 
  • ఆన్​ లైన్ ద్వారా అమ్మకాలకూ యత్నాలు 
  • మందులేని మామిడి పండ్లు అమ్మేందుకు ప్రత్యేక కేంద్రం 

మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయం లేకపోవడంతో వారే సొంతంగా వివిధ షాపులకు సప్లై చేయడంతో పాటు వారపు సంతల్లో అమ్ముకుంటున్నారు. మహిళా సంఘాల సభ్యులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ఫాన్ సరికొత్త ఆలోచన చేశారు. ఇందులో భాగంగా సూపర్ మార్కెట్ తరహాలో ఓ మార్ట్​ను ఏర్పాటు చేయడంతో పాటు 'మేడిన్ ఖమ్మం' పేరుతో బ్రాండింగ్ చేయాలని నిర్ణయించారు. మార్కెట్ పనులు ఇప్పటికే పూర్తికాగా... ఈ వారంలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

రూ. 30 లక్షలతో మహిళా మార్ట్ 

మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను నేరుగా అమ్ముకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం రూ. 30 లక్షలు ఖర్చు చేసి వైరా రోడ్లోని హవేలీ రెస్టారెంట్​ కు  ఎదురుగా ఉన్న డీఆర్టీఏకు చెందిన భవనంలో ప్రత్యేకంగా ఖమ్మం మహిళా మార్ట్'ను ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రత్యేక లోగోను డిజైన్ చేయడంతో పాటు 'మేడిన్ ఖమ్మం', 'ఫర్ ఖమ్మం' పేరుతో బ్రాండింగ్ చేసేందుకు చర్యలు చేపట్టారు. అలాగేమహిళా సంఘాల నుంచి ఒక్కొక్కటిగా సరుకులను తెప్పిస్తూ మార్కెట్​ను  ప్రారంభానికి సిద్ధం చేస్తున్నారు. 

వివిధ రకాల సరుకులు పంపించేందుకు చాలా మహిళా సంఘాలు ఆసక్తి చూపుతున్నా.. ప్రొడ క్ట్స్ క్వాలిటీ బాగున్న 20 సంఘాలను మాత్రమే ఎంపిక చేశారు. పప్పులు, బియ్యం, కారం, పసుపు సహా పలు సరుకులను ఎయిర్​ టైట్ ప్యాకింగ్ చేసి మార్ట్​ లో అందుబాటులో ఉంచుతున్నారు. మార్ట్ నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఐదుగురిని నియమించారు ఇదేబ్రాండిం గ్​ తో అమెజాన్ ఫ్లిప్​ కార్ట్ వంటి వాటిల్లోనూ అమ్మకాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఖమ్మంలోసక్సెస్ అయితే మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీల్లోనూ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్​ లో  సేంద్రియ రైతు బజార్ ఖమ్మం జిల్లాలో సేంద్రియ పంటలు పండిస్తున్న రైతులు కోసం కూడా కలెక్టర్ మరో ప్రత్యేక ఏర్పాటుచేశారు.

 వీడీవోస్ కాలనీలో ఉన్న ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్​ వెజ్ మార్కెట్లో ఖాళీగా ఉన్న నాన్​ వెజ్ షెడ్​ ను సేంద్రియ రైతుబజార్ మారుస్తున్నారు. ఇదే ప్లేస్​ లో గత కొన్ని నెలలుగా ప్రతి నెలా రెండో శని, ఆదివారాలు ఆర్గానిక్ మేళా పేరుతో మార్కెట్​ ను  నిర్వహిస్తున్నారు. తెలంగాణతో పాటు ఏపీ నుంచి కూడా పలువురు సేంద్రీయ రైతులు, వ్యాపారులు తమ పంటలను నేరుగా ఇక్కడికి తీసుకువచ్చి 22, 23 స్టాళ్లు ఏర్పాటు చేసి అమ్ముతున్నారు. 

ఇది సక్సెస్ కావడంతో ఖమ్మం జిల్లాలో ఆర్గానిక్ పంటలు సాగు చేస్తున్న 12 మంది రైతులకు తక్కువ కిరాయితో పర్మినెంట్ గా స్టాళ్లు కేటాయించాలని కలెక్టర్ నిర్ణయించారు. ఇక్కడ కూరగాయలు, బియ్యం. వివిధ రకాల పప్పులు, తేనె, జీసీసీకి చెందిన అరకు కాఫీ, దవాచాయ్. గానుగ నూనెలు, కారం పొడి, మిర్చి పసుపు తదితర స్టాళ్లు పెట్టనున్నారు. మహిళా మార్ట్ ప్రారంభం రోజునే దీన్ని కూడా ప్రారంభించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న రైతు బజార్ స్థలంలో మందులు వాడని మామిడి పండ్లు అమ్ముతున్నారు. దీనిని ఈ నెల మొదటి వారంలో కలెక్టర్ ప్రారంభించారు. మామిడి తోటలున్న రైతులు హోల్ సేల్ గా పంట అమ్మి సష్టపోకుండా, ఇథలీన్ ఛాంబర్ల ద్వారా మాగబె ట్టి ఎక్కువ లాభాలు పొందేలా ఏర్పాటు చేశారు. 

తయారు చేస్తున్న ఉత్పత్తులు 

 

  • ఖమ్మం జిల్లా చింతకాని మండలం గాం ధీనగర్కు చెందిన సరస్వతి స్వయం సహాయక సంఘానికి చెందిన సభ్యులు గత కొన్నేండ్లుగా తృణధాన్యాలతో స్నాక్స్, స్వీట్స్ తయారు చేస్తున్నారు. మామిడి, నిమ్మ, గోంగూర సహా వివిధ రకాల పచ్చళ్లు సైతం పెడుతున్నారు. 
  •  ఏన్కూరు మండలం తూతుకులింగంపేట కు చెందిన సిరి ఎస్ హెచ్ జీ సభ్యులు సర్ఫ్, బాత్రూమ్ క్లీనర్, డిష్ వాష్ వంటి క్లీనింగ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు. 
  •  కామేపల్లి మండలం, పండితాపురంలో సమ్మక్క సారక్క సంఘం మహిళలు నిక్ బియ్యం, పప్పులు, నూనెల వ్యాపారం చేస్తున్నారు. 
  •  ఖమ్మం రూరల్ మండలం వరంగల్  క్రాస్​ రోడ్​ కు  చెందిన శివ గణేశ్ గ్రూప్ సభ్యులు జ్యూట్ బ్యాగ్స్ తయారుచేస్తున్నారు.. 

మేంఐదుగురితో కలిసి ఆరేడేళ్లుగా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాం. ఇంటి దగ్గర నుంచే అమ్మకాలు చేస్తున్నాం.. కట్టెగానుగ, మినీ రైస్ మిల్, కారం మిల్, పసుపు, రాక్ సాల్ట్ గిర్ని కూడా ఇంట్లోనే ఏర్పాటుచేశాం. పల్లీలు, నువ్వుల పప్పు, కొబ్బరి కురిడీ, అవిసె గింజలు, సన్ ఫ్లవర్ నూనెలు గానుగలో తయారు చేసి అమ్ముతున్నాం. నవారా రకం బియ్యం, బ్లాక్స్ తో పాటు పలు దేశవాళీ రకాలను సైతం పండిస్తున్నాం. మా ఉత్పత్తులను ఖమ్మంలోని రెగ్యులర్ కస్టమర్లకు నేరుగా వారి ఇంటికి వెళ్లి అందిస్తున్నాం. మహిళా మార్ట్ ద్వారా ఇప్పుడు మా ఉత్పత్తులు అమ్ముకునేందుకు ఓ వేదిక దొరకడం సంతోషంగా ఉంది. 

బాణావత్ పద్మజ, పండితాపురం, ఖమ్మం జిల్లా 

 వారం రోజుల్లో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాం 

మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పించాలనే ఉద్దేశంతో మహిళా మార్ట్ ఏర్పాటు చేస్తున్నాం. అప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖమ్మంలో సక్సెస్ అయితే జిల్లాలోని ఇతర మున్సి పాలిటీలకూ విస్తరిస్తాం. ఇదే బ్రాండింగ్​ లో అమెజాన్, ఫ్లిప్కార్డ్ మటి ఆన్లైన్ పోర్టళ్ల ద్వారా సేల్స్ పెంచే ప్రయత్నంలో ఉన్నాం. ఆర్గానిక్ పండ్లు, కూరగాయలు అమ్మేందుకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లోనే ఖాళీగా ఉన్న షెడ్లు కేటాయించాం. ఈ వారంలోనే ప్రారంభం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. 


– ముజమ్మిల్ ఖాన్, ఖమ్మం కలెక్టర్–