
పెళ్లి చేసుకోవడంపై సంచలన కామెంట్స్ చేసింది నచ్చావులే బ్యూటీ మాధవీ లత. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆమె సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో సరదాగా తన ఫ్యాన్స్ తో ముచ్చటించింది. ఇందులో భాగంగా తన లైఫ్ గుంరించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది. ఇందులో భాగంగా ఒక నెటిజన్ అత్యుత్సాహాంతో మీ పెళ్లి ఎప్పుడు అంటూ అడిగేశాడు.
ఈ ప్రశ్నకు అసహనానికి గురైన మాధవీ లత.. సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది. "ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే వయసు ఒకటే సరిపోదు. ఆమె శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండాలి. పెళ్లి చేసుకోవటం అనేది ఆమె నిర్ణయం. ప్రస్తుతం నేను శారీకంగానూ, మానసికంగానూ పెళ్లికి రెడీగా లేను. నా భవిష్యత్తుపై కూడా నమ్మకంగా లేను. ఇది నా నిర్ణయం. నా జీవితం’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం మాధవీ లత పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. మాధవీ లత చేసిన ఈ పోస్ట్ కు లేడీ అభిమానుల నుండి మద్దతు వస్తోంది.