వాతావరణశాఖ ముందే హెచ్చరించినా… ప్రభుత్వం పట్టించుకోలేదు

వాతావరణశాఖ ముందే హెచ్చరించినా… ప్రభుత్వం పట్టించుకోలేదు

భారీవర్షాలున్నాయని వాతావరణశాఖ ముందే హెచ్చరించినా… ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు కాంగ్రెస్ నేత మధు యాష్కీ గౌడ్. అందుకే ఇంత నష్టం జరిగిందన్నారు. ఇంత జరుగుతున్నా కేసీఆర్ ప్రగతి భవన్ దాటకపోవడం దారుణంమన్నారు. ఇప్పటివరకు ఎంతనష్టం జరిగిందో సైంటిఫిక్ గా సర్వే చేయలేదన్నారు. గ్రేటర్ ఎన్నికల కోసమే వరద సాయం పేరుతో డబ్బులు పంచుతున్నారన్నారు మధుయాష్కీ.

ఆపదివేలు కూడా బాధితులకివ్వకుండా TRS కార్యకర్తలకు ఇస్తున్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరద బాధితుల్ని మోసం చేస్తున్నాయన్నారు దాసోజు శ్రవణ్. కేంద్రానికి తప్పుడు లెక్కలిస్తూ GHMC అధికారులు డ్రామా ఆడుతున్నారన్నారు. కేసీఆర్ కు తన ఫాంహౌజ్ లో చెట్లపై ఉన్న ప్రేమ… వరద బాధితులపై, పంట నష్టపోయిన రైతులపై లేదన్నారు. మరో రెండు సార్లు సెంట్రల్ టీంను పరిశీలనకు పంపాలని కేంద్రాన్ని కోరుతామన్నారు.