‘శాకుంతలం’ నుంచి క్రేజీ అప్డేట్

‘శాకుంతలం’ నుంచి క్రేజీ అప్డేట్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో నటించిన తాజా చిత్రం ‘శాకుంతలం’. ఈ మూవీ ఏప్రిల్ 14న విడుదల కానుంది. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శ‌కుంత‌ల‌గా స‌మంత‌, దుష్యంతుడిగా దేవ్ మోహ‌న్ నటించారు. ఈ చిత్రంలో సినియర్ నటి మధుబాల పాత్రను రివీల్ చేశారు మేకర్స్. శాకుంతలంలో ఆమె ‘అప్సర మేనక’గా కనిపించనుంది. మేనకను తలపించేలా తెలుపు వర్ణంలోని చీర, వజ్రాలతో పొదిగిన కిరీటం, నగలు ధరించిన ఆమె లుక్ ఆకట్టుకునేలా ఉంది. 

ఈ మూవీలో దుర్వాస మహర్షి పాత్రలో మోహన్ బాబు, అనసూయగా అనన్య నాగళ్ల, ప్రియంవదగా అదితి బాలన్, ఇంద్రుడిగా జిషుసేన్ గుప్తా నటించారు. ఇప్పటికే వీరి ఫస్ట్ లుక్ పోస్టర్లను మేకర్స్ విడుదల చేశారు. కాళిదాసు రాసిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ నాటకం ఆధారంగా సినిమాను రూపొందిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. తెలుగు, త‌మిళ‌, క‌న్నడ‌, మ‌ల‌యాళ, హిందీ భాష‌ల్లో ఏప్రిల్ 14న శాకుంతలం విడుదల కానుంది.