నటి మాధురి దీక్షిత్ ఇంట విషాదం

నటి మాధురి దీక్షిత్ ఇంట విషాదం

ప్రముఖ బాలీవుడ్‌ నటి మాధురి దీక్షిత్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మాధురి దీక్షిత్ తల్లి స్నేహలతా దీక్షిత్ (91) 2023, మార్చి 12న కన్నుమూశారు. ముంబైలోని ఆమె స్వగృహంలో ఉదయం తుది శ్వాస విడిచారు. మాధురి, ఆమె భర్త శ్రీరామ్ నేనే ఈ విషయాన్ని ప్రకటించారు. "మేము ఎంతగానో ప్రేమించే ఆయి(అమ్మ) ఈ రోజు ఉదయం తనకు ఇష్టమైన వారి మధ్య ఉన్నప్పుడు స్వర్గస్తులయ్యారు" అని రాసుకొచ్చారు. అయితే స్నేహలత మృతికి కారణాలేంటో ఇంకా తెలియరాలేదు. మాధురి తల్లి మరణవార్తపై పలువురు సెలబ్రిటీలు, అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. వర్లీలోని శ్మశాన వాటికలో మధ్యాహ్నం 3.00 గంటలకు స్నేహలత అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలిపారు.