
ఇండియన్ ఆర్మీలో విధులు నిర్వహించిన మేజర్ జనరల్ మాధురి కనిత్కర్ అరుదైన ఘనత సాధించారు. ఆమెను లెఫ్టినెంట్ జనరల్ హోదా వరించింది. భారత సైన్యంలో ప్రమోషన్ పొందిన మూడవ మహిళగా మాధురి గుర్తింపు పొందారు. భారత మిలటరీలో మాధురి కనిత్కర్ గత 37 ఏళ్లుగా పనిస్తున్నారు. సర్జన్ వైస్ అడ్మిరల్, భారత నావికాదళం, సైన్యంలో మాజీ 3స్టార్ ఫ్లాగ్ ఆఫీసర్ గా మాధురి కనిత్కర్ పని చేశారు. అదే సమయంలో ఆర్మీలో రెండవ అత్యున్నత పదవిని సాధించిన మొదటి మహిళా పీడియాట్రిషియన్‌గా ఘనత సాధించారు. మేజర్ జనరల్ మాధురి కనిత్కర్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కింద నియమించబడ్డారు.
మేజర్ జనరల్ మాధురి కనిత్కర్, లెఫ్టినెంట్ జనరల్ అయిన ఆమె భర్త రాజీవ్ సాయుధ దళాలలో ర్యాంకు సాధించిన మొదటి జంటగా గుర్తింపు పొందారు.