
దళితబంధు పథకం అనేది దళితుల పాలిటి రాబంధువు లాంటిదని, సీఎం కేసీఆర్ కుట్రలపై దళితులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు చేశారు మధుయాష్కీ. సీఎం కేసీఆర్ తన ఫాంహౌస్ కు వెళ్లడానికి రూట్ క్లియర్ చేసుకునేందుకే వాసాలమర్రిని దత్తత తీసుకుని కుట్రలు పన్నుతున్నారన్నారు మధుయాష్కీ. వాసాలమర్రి చుట్టూ కేసీఆర్ బినామీల పేర్లపై ఉన్న.. వందల ఎకరాల భూముల రేట్లు పెంచుకునేందుకే దత్తత తీసుకున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్న మధుయాష్కీ.. దమ్ముంటే కల్వకుంట్ల ఫ్యామిలీపై కేంద్రం సమగ్ర విచారణ చేపట్టాలని సవాల్ విసిరారు.