పోలీసులే డ్రైవర్‌ను కొట్టి, తరిమి రూ.1.45 కోట్ల హవాలా డబ్బు దోచుకున్నారు: 10 మంది సస్పెండ్..

పోలీసులే డ్రైవర్‌ను కొట్టి, తరిమి రూ.1.45 కోట్ల హవాలా డబ్బు దోచుకున్నారు: 10 మంది సస్పెండ్..

మధ్యప్రదేశ్‌లో ఓ పెద్ద  హవాలా స్కాం బయటపడింది. దింతో సియోని జిల్లాకు చెందిన సబ్-డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ (SDOP) తో పాటు మొత్తం 10 మంది పోలీసు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. వీరిపై ఒక కారులో మహారాష్ట్రకు పంపుతున్న రూ.1.45 కోట్ల హవాలా డబ్బును దోచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

 విషయం ఎలా బయటికొచ్చిందంటే, డబ్బు పంపుతున్న డ్రైవర్, వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (జబల్‌పూర్) ప్రమోద్ వర్మ వెంటనే దీనిపై దర్యాప్తు చేయమని, ఈ సంఘటనపై మూడు రోజుల్లోగా పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని కూడా ఆదేశించారు. ఐజీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా, మధ్యప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) కైలాష్ మక్వానా, ఎస్‌డిఓపి పూజా పాండేను సస్పెండ్ చేస్తూ ఆర్డర్లు ఇచ్చారు.  

అసలు విషయం ఏంటంటే: బుధవారం రాత్రి పోలీస్ తనిఖీలు జరుగుతున్నప్పుడు, సిలాదేహి అడవిలో ఒక కారును ఆపినట్లు సియోని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) సునీల్ కుమార్ మెహతా చెప్పారు. బందోల్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్, SDOP ఆఫీస్ సిబ్బంది ఇదంతా చేశారు. సస్పెండ్ అయిన వారిలో బందోల్ స్టేషన్ ఇన్‌చార్జ్ అర్పిత్ భైరామ్ (సబ్-ఇన్‌స్పెక్టర్), హెడ్ కానిస్టేబుళ్లు మఖన్, రవీంద్ర ఉయికే, అలాగే కానిస్టేబుళ్లు జగదీష్ యాదవ్, యోగేంద్ర చౌరాసియా, రితేష్, నీరజ్ రాజ్‌పుత్, కేదార్, సదాఫాల్ ఉన్నారు.

అయితే మధ్యప్రదేశ్‌లో కట్ని నుండి మహారాష్ట్రలోని జల్నాకు ఈ పెద్ద మొత్తంలో డబ్బు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దింతో  ఆ డబ్బును స్వాధీనం చేసుకొని సీనియర్లకు చెప్పకుండా డ్రైవర్‌ను కొట్టి, తరిమేసి, డబ్బు లాక్కోవడానికి ప్రయత్నించారు. ఈ పోలీసు బృందం కూడా పట్టుకున్న హవాలా డబ్బు గురించి పై ఆఫీసర్లకు చెప్పలేదు. డబ్బు పోగొట్టుకున్న వ్యాపారవేత్త గురువారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడంతో ఈ దొంగతనం బయటపడింది.