కునో నేషనల్ పార్క్ లోకి పులి ఎంట్రీ.. ముప్పేం లేదంటున్న అధికారులు

కునో నేషనల్ పార్క్ లోకి పులి ఎంట్రీ.. ముప్పేం లేదంటున్న అధికారులు

రాజస్థాన్‌కు చెందిన ఒక పులి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ (కేఎన్‌పీ)లోకి ప్రవేశించింది. దేశంలో చిరుతల జనాభాను పునరుద్ధరించడానికి, పెంచడానికి అక్కడ కొంత కాలం కిందే ఆఫ్రికా నుంచి కొన్ని చిరుతలను తీసుకొచ్చి పెట్టారు. ఈ క్రమంలో కొత్తగా ప్రవేశించిన పులి నుంచి మిగతా వాటికి ఎటువంటి ముప్పు లేదని అధికారులు చెప్పారు. చిరుతలను పార్క్‌లోని మెత్తటి ఎన్‌క్లోజర్‌లు, బోమాస్‌లోవ ఉంచినట్లు వివరించారు.

రెండు మూడు రోజుల క్రితం కేఎన్‌పీలో టైగర్ పగ్‌మార్క్‌లు కనిపించాయని కెఎన్‌పి డైరెక్టర్ ఉత్తమ్ శర్మ తెలిపారు. తాజాగా రాజస్థాన్‌లోని రణతంబోర్ టైగర్ రిజర్వ్ నుంచి దాదాపు మూడు సంవత్సరాల వయస్సు గల ఈ పులి KNP నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలోకి ప్రవేశించిందని అధికారులు తెలిపారు.

కునోలో చిరుతలు

ప్రస్తుతం KNPలో ఏడు మగ చిరుతలు, కొన్ని ఆడ చిరుతలు, ఒక పిల్ల ఉన్నాయి. చిరుతలు కూడా పులులను చూసి భయపడతాయని, వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉంటాయని అధికారులు తెలిపారు. కేఎన్‌పీలో చిరుతపులులు ఎక్కువగా ఉన్నాయని వారు ఈ సందర్భంగా తెలిపారు.