Earth quake: టర్కీలో భూకంపం..కుప్పకూలిన భవనాలు.. గజగజ వణికిన ప్రజలు

Earth quake: టర్కీలో భూకంపం..కుప్పకూలిన భవనాలు.. గజగజ వణికిన ప్రజలు

టర్కీలో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం( అక్టోబర్​28) పశ్చిమ టర్కీలోని బలికేసిర్​ ప్రావిన్స్​ లో ని సిండిర్గిలో రిక్టర్​ స్కేల్​ పై 6.1తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇస్తాంబుల్, బుర్సా, మానిసా ,ఇజ్మీర్‌తో సహా సమీపంలోని అనేక ప్రావిన్సులలో ప్రకంపనలు సంభవించాయి. భూకంపం ధాటికి పలు భవనాలు కుప్పకూలాయి. మరొకొన్ని ఉయ్యాల ఊగినట్లు ఊగాయి. 22మంది గాయపడ్డారు. 

గత ఆగస్టులో కూడా సిందిర్గిలో 6.1 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. ఒకరు చనిపోయారు. పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు.  మంగళవారం సంభవించిన భూకంపంలో గతంలో బలహీనపడిన భవనాలు కుప్పకూలిపోయాయని స్థానిక అధికారులు చెప్పారు. అప్పటి నుంచి విశాలమైన బలికేసిర్ ప్రాంతంలో భూప్రకంపనలు వస్తూనే ఉన్నాయి.  

టర్కీలో భూకంపాలు సహజం. ఇటీవల కాలంలో అనేక భూకంపాలను చూసింది. 2023లో 7.8 తీవ్రతతో  భూకంపం వచ్చి దక్షిణ టర్కీ ,ఉత్తర సిరియాను అతలాకుతలం చేసింది. 59 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయాపడ్డారు. లక్షలాది భవనాలు ధ్వంసమయ్యాయి.