రష్యాలో నిమిషాల వ్యవధిలో రెండుసార్లు భూకంపం: సునామీ హెచ్చరిక జారీ

రష్యాలో నిమిషాల వ్యవధిలో రెండుసార్లు  భూకంపం: సునామీ హెచ్చరిక జారీ

రష్యాలో ఆదివారం (జూలై20) రెండు భారీ భూకంపాలు వణికించాయి. రష్యాలోని కమ్చట్కా ప్రాంత తీరానికి సమీపంలో రిక్టర్ స్కేల్ 6.7 తీవ్రతతో, ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో 7.4 తీవ్రతతో వరుసగా అనేక శక్తివంతమైన భూకంపాలు సంభవించాయని జర్మన్ రీసెర్చ్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) ,యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ఈ భూకంపాలను ధృవీకరించాయి.

సునామీ హెచ్చరిక: పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంతో పాటు హవాయికి కూడా సునామీ హెచ్చరిక జారీ చేసింది. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల  పరిధిలో ప్రమాదకరమైన సునామీ తరంగాలు సంభవించే అవకాశం ఉందని USGS హెచ్చరించింది.

ప్రాథమిక భూకంప డేటా ఆధారంగా..భూకంప కేంద్రం ప్రాంతంలో భారీగానే విధ్వంసం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు..అయితే ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇటీవల కాలంలో రష్యాలో ఇదే అతిపెద్ద భూకంపం అని తెలుస్తోంది.