బుడాపెస్ట్: నార్వే గ్రాండ్ మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సన్‌కు టోటల్ చెస్ వరల్డ్ చాంపియన్‌షిప్ టూర్ పైలట్ ఫాస్ట్ క్లాసికల్ పోటీల్లో పరాజయం ఎదురైంది. శనివారం హైక్ మార్టిరోసియన్ (ఆర్మేనియా)తో జరిగిన గేమ్‌లో కార్ల్సన్ ఓటమిపాలయ్యాడు. దాంతో గత 15 ఏళ్లుగా తాను నిలబెట్టుకున్న వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌ను కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు. జులై 2011 నుంచి టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.
అయితే, ఫాస్ట్ క్లాసికల్ విభాగంలో ఐదు డ్రాలు, ఒక ఓటమి తర్వాత కార్ల్సన్ 15.8 రేటింగ్ పాయింట్లను కోల్పోయాడు. దాంతో లైవ్ రేటింగ్ 2807.2కు పడిపోయింది. తొలి గేమ్‌లో తెల్లపావులతో ఆడిన మార్టిరోసియాన్తో 41 ఎత్తుల వద్ద కార్ల్‌సన్‌ను ఓడించాడు. రెండో గేమ్‌ను ఇద్దరు ప్లేయర్లు డ్రా చేసుకున్నారు. తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి... వెస్లీ సోతో జరిగిన గేమ్‌ల్లో ఒక విజయం, ఒక డ్రా నమోదు చేశాడు.
