సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర ఆలయం వద్ద బుధవారం అయ్యప్ప స్వాములకు మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. సూర్యాపేట పట్టణానికి చెందిన కొంపెల్లి ఉషారాణి కుమారుడు కొంపెల్లి అనిల్ రెడ్డి, ఆశ్రిత రెడ్డి, స్నేహిత్ రెడ్డి అమెరికాలో నివాసం ఉంటూ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద అయ్యప్ప స్వాములకు, అన్ని మాల ధారణ స్వాములకు, అన్నప్రసాద వితరణ చేశారు.
సుమారు 1000 మంది స్వాములకు అన్న ప్రసాద వితరణ చేశారు. అనంతరం ఉషారాణి మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వాములందరికీ అన్న ప్రసాద వితరణ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు అనిత, సురేందర్ రెడ్డి, భవిష్య, నవీన, నవీన్ రెడ్డి, ప్రశాంత, వేణు, వాసవి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
